బీజేపీలోకి భారీ వలసలు: టీడీపీ, జనసేనల నుంచే కాదు వైసీపీ నుంచి కూడా...

First Published Oct 3, 2019, 4:11 PM IST

ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ముఖ్యంగా ఇద్దరు మాజీమంత్రులు గుడ్ బై చెప్పేశారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్న వారు సైతం అమాంతంగా పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ కండువా కప్పేసుకున్నారు. 

ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ముఖ్యంగా ఇద్దరు మాజీమంత్రులు గుడ్ బై చెప్పేశారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్న వారు సైతం అమాంతంగా పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ కండువా కప్పేసుకున్నారు.
undefined
తెలుగుదేశం పార్టీలో కీలకనేత, మాజీమంత్రి డా.శనక్కాయల అరుణ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 70 మంది కార్యకర్తలతో కలిసి ఢిల్లీ చేరుకున్న ఆమె బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణల సమక్షంలో బీజేపీలో చేరారు.
undefined
తనకు తెలుగుదేశం పార్టీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ తనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని దేశంలో ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా లు చేస్తున్న కృషిని గుర్తించి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
undefined
మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, మాజీమంత్రి వాకాటి నారాయణ రెడ్డి సైతం బీజేపీలో చేరేందుకు సన్నద్దమయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితుడినయ్యానని అందువల్లే తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
undefined
విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ సైతం పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో నెలకొన్న అసమ్మతి కారణంగా తోట నగేష్ తెలుగుదేశం పార్టీకి వీడి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
undefined
బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఈనెల 3 గురువారం సాయంత్రం తోట నగేష్ బీజేపీలో చేరనున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు తోట నగేష్.
undefined
మరోవైపు గుంటూరు జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాభూషణం సైతం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న పాతూరి నాగభూషణం సాయంత్రం జేపీ నడ్డా సమక్షంలో కాషాయి కండువా కప్పుకోనున్నారు.
undefined
ఇకపోతే రిటైర్డ్ హైకోర్టు జడ్జి నక్కా బాలయోగి సైతం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలే పదవీ విరమణ చేసిన బాలయోగి గతంలో తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత వైసీపీలో కూడా చేరతారంటూ ప్రచారం జరిగింది. ఎన్నికల్లో ఏ పార్టీలో చేరని ఆయన ప్రస్తుతం బీజేపీ కండువా కప్పుకోనున్నారు.
undefined
అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన గట్టి చిన్న సత్యనారాయణ, సైతం బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఈనెల 3న సాయంత్రం బీజేపీ జాతీయ కార్యాలయంలో జేపీ నడ్డా సమక్షంలో కాషాయి కండువా కప్పుకోనున్నారు.
undefined
ఇకపోతే జనసేన పార్టీకి సైతం షాక్ ఇచ్చారు ఆ పార్టీ నేత చింతల పార్థసారధి. మాజీ ప్రభుత్వ ఉద్యోగి అయిన చింతల పార్థసారథి గత ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ తరపున పోటీ సైతం చేశారు.
undefined
అనకాపల్లి జనసేన పార్టీ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై ఓటమి చెందారు చింతల పార్థసారథి. కొంతకాలంగా పార్టీపట్ల అసంతృప్తిగా ఉన్న ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
undefined
ఇకపోతే వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పూతలపట్టు రవి సైతం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. 2014 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన పూతలపట్టు రవికి గత ఎన్నికల్లో జగన్ టిక్కెట్ ఇవ్వలేదు.
undefined
జగన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి ఆయన ఇంటిదగ్గర కుటుంబ సమేతంగా వేచి చూస్తూ హాట్ టాపిక్ గా మారారు పూతలపట్టు రవి. అంతేకాదు ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియో సైతం విడుదల చేసి రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
undefined
మరోవైపు రామినేని ఫౌండేషన్ సంస్థ చైర్మన్, ఎన్ఆర్ఐ రామినేని ధర్మ ప్రచారక్ సైతం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. రామినేని ఫౌండేషన్ సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ధర్మ ప్రచారక్. ప్రతీ ఏడాది పలు రంగాల్లో అద్భుత ప్రతిభకనబరచిన నిష్ణాతులకు రామినేని ఫౌండేషన్ సంస్థ ద్వారా అవార్డులు సైతం అందిస్తారు.
undefined
తెలుగుదేశం, జనసేన పార్టీ, వైసీపీతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సైతం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నేత బొబ్బిలి శ్రీనివాసరావు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు బొబ్బిలి శ్రీనివాసరావు.
undefined
ఇకపోతే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన యువ నేత, తెలుగు యువత అధ్యక్షుడు తూళ్ల వీరేందర్ గౌడ్ సైతం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను కలిశారు. గురువారం సాయంత్రం జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు తూళ్ల వీరేందర్ గౌడ్.
undefined
click me!