వెంగయ్య నాయుడు కుటుంబానికి జనసేనాని వరాల జల్లు..

First Published Jan 23, 2021, 12:33 PM IST

ఈ నెల 18న బేస్తవారిపేట మండలం సింగరపల్లిలో ఆత్మహత్యకు పాల్పడ్డ జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు కుటుంబాన్ని ఒంగోలులో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. వెంగయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ఈ నెల 18న బేస్తవారిపేట మండలం సింగరపల్లిలో ఆత్మహత్యకు పాల్పడ్డ జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు కుటుంబాన్ని ఒంగోలులో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. వెంగయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
undefined
వెంగయ్య కుటుంబానికి జనసేన తరపున రూ .8లక్షల50వేలు ఆర్ధిక సాయాన్ని పవన్ అందించారు. వెంగయ్య నాయుడు పిల్లల చదువులు పూర్తయ్యే వరకూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
undefined
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఒంగోలులో జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పరామర్శించారు.
undefined
వెంగయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంగయ్య కుటుంబానికి జనసేన తరపున రూ.8లక్షల50వేలు ఆర్ధిక సాయాన్ని పవన్ అందించారు.
undefined
వెంగయ్య నాయుడు పిల్లల చదువులు పూర్తయ్యే వరకూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ నెల 18న బేస్తవారిపేట మండలం సింగరపల్లిలో వెంగయ్య ఆత్మహత్యకు పాల్పడ్డారు.
undefined
గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు బెదిరింపుల వల్ల వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో జనసేనాని పరామర్శించారు.
undefined
ఎమ్మెల్యే మాటలకు మానసిక వేదనకు గురయ్యారని.. ప్రశ్నించినందుకే వెంగయ్యను చంపేశారని ఆరోపించారు. ప్రశ్నించే వారిని ఇలా చేస్తారా.. దాష్టీకాలు ఎక్కువవుతుంటే ప్రజల్లో తిరుగుబాటు తప్పదన్నారు. వైఎస్సార్‌సీపీ నేతల వారి వైఖరి ఎలా ఉందో వారి కుటుంబ సభ్యులు కూడా ఆలోచించుకోవాలన్నారు.
undefined
‘జగన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే చేసిన పనికి శిక్షిస్తారా.. మీకు ఆ ధైర్యం ఉందా.. అన్నా రాంబాబు గుర్తుంచుకో నిన్ను అద:పాతాళానికి తొక్కేస్తాం’అంటూ పవన్ హెచ్చరించారు.
undefined
పోలీస్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్నారని.. వెంగయ్య మృతి వైఎస్సార్‌సీపీ పతనానికి నాంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
undefined
‘ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై మీ చానెల్స్‌లో వేసుకోండి. తమ పేపర్స్‌లో రాసుకోండి. మీరు జర్నలిస్టులను కూడా వదలటం లేదు.
undefined
మీరు అనుకున్న వాళ్లే జర్నలిస్టులా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా? ఫ్యూడలిస్ట్ వ్యవస్థలో ఉన్నామా? జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి’అన్నారు.
undefined
click me!