ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండురోజుల పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాకు చేరుకున్నారు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు ఘన స్వాగతం పలికారు.