స్టీఫెన్ రవీంద్రకు రెడ్ సిగ్నల్: ఐబీచీఫ్ పోస్టుకు ముగ్గురు పోటీ

First Published Oct 14, 2019, 1:00 PM IST

ఏపీలో ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్టుపై కసరత్తు జరుగుతుంది. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు పూర్తిస్థాయి ఐబీ చీఫ్ ను నియమించలేదు జగన్ ప్రభుత్వం. ఈ పరిణామాల నేపథ్యంలో పూర్తి స్థాయి అధికారిని నియమించేందుకు సీఎంవో పెద్ద కసరత్తే చేస్తోంది. 
 

ఏపీలో ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్టుపై కసరత్తు జరుగుతుంది. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు పూర్తిస్థాయి ఐబీ చీఫ్ ను నియమించలేదు జగన్ ప్రభుత్వం. ఈ పరిణామాల నేపథ్యంలో పూర్తి స్థాయి అధికారిని నియమించేందుకు సీఎంవో పెద్ద కసరత్తే చేస్తోంది.
undefined
ఇంటెలిజెన్స్ విభాగం చాలా కీలకమైన విభాగం. డీజీపీ తర్వాత అంతటి కీలకమైన పోస్టు ఇంటెలిజెన్స్ చీఫ్. రాష్ట్రంలో ఏమూల ఏం జరుగుతుందో ప్రతీది క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రతీరోజు ముఖ్యమంత్రికి చేరవేయాల్సిన పరిస్థితి.
undefined
అంతేకాదు రాష్ట్రంలో శాంతి భద్రతలతోపాటు ఎవరికి ఏ ముప్పు ఉంది, కీలక సమాచారాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చేరవేయాల్సి ఉంటుంది. అంతటి కీలకమైన పోస్టు కోసం సీఎం జగన్ మరియు సీఎంవో కార్యాలయం ఒక కసరత్తు చేస్తోందని చెప్పాలి.
undefined
ఇకపోతే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ఏపీకి వస్తారని ఆయన ఐబీ చీఫ్ గా వ్యవహరిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆయన డిప్యూటేషన్ కు కేంద్రం రెడ్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన తెలంగాణ పోలీస్ శాఖలో విధుల్లో చేరిపోయారు.
undefined
దాంతో ఏపీకి న్యూ ఐబీ చీఫ్ ఎవరా అన్న ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్టు కోసం ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన కుమార్ విశ్వజిత్ ను ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి నుంచి తప్పించి ఏసీబీ డీజీకే పరిమితం చేసింది ఏపీ ప్రభుత్వం.
undefined
దాంతో ఇంటెలిజెన్స్ చీఫ్ గా కొత్తవారిని నియమిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గా పనిచేస్తున్న ద్వారకా తిరుమల రావు ఎంపికపై కసరత్తు జరుగుతోంది.
undefined
డైరెక్టర్ జనరల్ ర్యాంకు ఉన్న ద్వారకా తిరుమల రావుకు మంచి గుర్తింపు ఉంది. రాయలసీమలో ఎస్పీ, డీఐజీగా, కోస్తా ఐజీగా, రాష్ట్ర సీఐడీ అధిపతిగా పనిచేసి ప్రశంసలు అందుకున్నారు కూడా. ప్రస్తుతం విజయవాడ కమిషనర్‌గా సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పరిణమాల నేపథ్యంలో ద్వారకా తిరుమల రావు పేరు మెుదటి పరిశీలనలో ఉంది.
undefined
ఒకవేళ అడిషనల్‌ డీజీ స్థాయి అధికారిని నియమించాల్సి వస్తే రాయలసీమకు చెందిన మరో ఐపీఎస్ అధికారి కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డిని నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. వివాద రహితుడిగా పేరున్న రాజేంద్రనాథ్‌రెడ్డి గత ప్రభుత్వంలో లూప్‌లైన్‌ ఉన్నారు.
undefined
మూడు జిల్లాల ఎస్పీగా, డీఐజీగా, ఐజీగా పనిచేసిన రాజేంద్రనాథ్‌రెడ్డి విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా పనిచేస్తున్నారు రాజేంద్రనాథ్ రెడ్డి. ఆయన పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
undefined
మరోవైపు శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ పేరు కూడా పరిశీలనలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పోస్టుకు ఆయనను సమర్థుడిగా భావిస్తోంది. రాష్ట్రంలో ఎస్‌ఐబీలో పనిచేసిన అయ్యన్నార్‌, గుంటూరు ఎస్పీగా, జాతీయస్థాయిలో ఎన్‌ఐఏలో సమర్థవంతంగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురిలో ఎవరిని ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్టు వరిస్తుందో అన్నది వేచి చూడాలి.
undefined
click me!