స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మిలకు కేంద్రం షాక్: జగన్ రంగంలోకి దిగినా కదలని ఫైళ్లు

First Published Oct 14, 2019, 12:26 PM IST

పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం జగన్ విజ్ఞప్తిని సానుకూలంగా అంగీకరించినప్పటికీ కేంద్రం అంగీకరించకపోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. జగన్ తో కేంద్రం అమితుమీకి సిద్ధమంటున్నట్లుందని గుసగుసలాడుకుంటున్నారు. 
 

ఏ రాష్ట్రంలోనైనా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారికి అనుకూలమైన వారికి అగ్రతాంబూలం ఇవ్వడం ఆనవాయితీ. అది రాజకీయ పదవుల పందేరంలోనైనా అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడంలోనైనా.
undefined
ఏపీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేయకుండానే కీలక శాఖలకు సంబంధించి అధికారులను మార్చివేసి తనకు అనుకూలమైన వారిని వేసుకున్నారు.
undefined
జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమను కొంతమంది అధికారులు వేధిస్తున్నారంటూ పదేపదే ఆరోపించారు. ముఖ్యంగా ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై అయితే తీవ్ర ఆరోపణలు చేశారు సీఎం జగన్ అండ్ కో.
undefined
ఎన్నికల ప్రచారంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపైనా, ఆనాటి డీజీపీ ఆర్పీ ఠాకూర్ పైనా కేంద్ర ఎన్నికల సంఘానికి వరుస ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై బదిలీ వేటు వేసింది. అంతేకాదు ఆయనను ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం కావొద్దని ఆదేశించింది కూడా.
undefined
వైసీపీ అధికారంలోకి రావడం, వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కీలక ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయిన సంగతి కూడా తెలిసిందే. ఇకపోతే ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్రను తీసుకు తెచ్చుకుందామని సీఎం జగన్ ప్రయత్నించారు.
undefined
తెలంగాణలో ఐజీగా పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్రను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించుకునేందుకు పెద్ద కసరత్తే చేశారు సీఎం జగన్. వైఎస్ హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా స్టీఫెన్ రవీంద్ర పనిచేయడంతో పాటు జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయనను ఐబీ చీఫ్ గా నియమించాలని ప్రయత్నించారు.
undefined
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మెుదటి భేటీలోనే ఈ అంశంపై చర్చ జరిగింది. అందుకు సీఎం కేసీఆర్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అనంతరం స్టీఫెన్ రవీంద్ర ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలవడం కూడా జరిగింది.
undefined
దాదాపు నాలుగు నెలలుగా స్టీఫెన్ రవీంద్రను ఏపీకి బదిలీ చేయడంపై కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. అటు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఉండి ఫైల్ కదిలించేందుకు ప్రయత్నించినప్పటికీ అవి సఫలీకృతం కాలేదు. ఇకపోతే ఇటీవలే సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగినప్పటికీ ఫైల్ కదల్లేదు.
undefined
తెలంగాణ సీఎం కేసీఆర్ అంగీకరించినా కేంద్రం కరుణించకపోవడంతో కోరుకున్న ఐపీఎస్ అధికారి వెనక్కి వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. దాంతో స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ పోలీస్ శాఖలో తిరిగి విధుల్లో చేరకతప్పాల్సిన పరిస్థితి నెలకొంది.
undefined
ఇకపోతే ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. శ్రీలక్ష్మీ బదిలీకి తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కేంద్రప్రభుత్వం మాత్రం నో అంటోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనింగ్ శాఖలో పనిచేశారు శ్రీలక్ష్మీ.
undefined
జగన్ ఆస్తుల కేసుతోపాటు ఓబులాపురం మైనింగ్ కుంభకోణం కేసులో ఆమె జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జైల్లో తీవ్ర అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె నిర్దోషిగా బయటకు వచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం శ్రీలక్ష్మిని తెలంగాణ కేడర్ కు కేటాయించింది కేంద్రం.
undefined
1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శ్రీలక్ష్మీ చిన్నవయస్సులోనే సివిల్ సర్వెంట్ కు ఎంపికయ్యారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి స్థాయికి వెళ్లాల్సిన ఆమె ఓబుళాపురం మైనింగ్ కేసు ఆమె కెరీర్ కు మైనస్ గా మారింది.
undefined
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో సేవలందించాలనుకుంటున్నానని అందుకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు శ్రీలక్ష్మి. అందుకు కేసీఆర్ ప్రభుత్వం సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె రేపోమాపో ఏపీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ చార్జ్ గా నియమితులవుతారని కూడా ప్రచారం జరిగింది.
undefined
అయితే ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని డిప్యుటేషన్ పై ఏపీకి పంపే విషయంలో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఇటీవలే కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షాను సైతం కలిసినా లాభం లేకుండా పోయింది.
undefined
అటు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి సైతం ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. ఇకపోతే ముఖ్యమంత్రి వైయస్ జగన్ నేరుగా రంగంలోకి దిగారు. శ్రీలక్ష్మిని ఏపీకి డిప్యుటేషన్ పై పంపాలని ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరినప్పటికీ ఇప్పటి వరకు తేల్చడం లేదు కేంద్రం.
undefined
ఇప్పటికే స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ పోలీస్ శాఖలో విధుల్లో చేరిన నేపథ్యంలో ఇక శ్రీలక్ష్మి కూడా త్వరలోనే తెలంగాణలో విధుల్లో చేరే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. అయితే శ్రీలక్ష్మీమాత్రం ఢిల్లీలోనే ఉంటూ పట్టుబడుతున్నారు.
undefined
మెుత్తానికి పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం జగన్ విజ్ఞప్తిని సానుకూలంగా అంగీకరించినప్పటికీ కేంద్రం అంగీకరించకపోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. జగన్ తో కేంద్రం అమితుమీకి సిద్ధమంటున్నట్లుందని గుసగుసలాడుకుంటున్నారు.
undefined
click me!