మనోజ్-మౌనిక దంపతులు టీడీపీలో చేరితే ఎన్నికల్లో పోటీ చేసేది ఎవరు?.. వారి ముందు రెండు ఆప్షన్లు..!!

Published : Aug 05, 2023, 10:19 AM ISTUpdated : Aug 05, 2023, 10:21 AM IST

ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్- భూమా మౌనిక దంపతులు పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం చేసుకుంటున్నారు. చంద్రబాబుతో భేటీ తర్వాత మనోజ్ చేసిన కామెంట్స్‌ కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చాయి.

PREV
19
మనోజ్-మౌనిక దంపతులు టీడీపీలో చేరితే ఎన్నికల్లో పోటీ చేసేది ఎవరు?.. వారి ముందు రెండు ఆప్షన్లు..!!

ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్- భూమా మౌనిక దంపతులు పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం చేసుకుంటున్నారు. గత  కొంతకాలంగా  మనోజ్ రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారు. అయితే ప్రస్తుతం మంచు కుటుంబానికి.. వైఎస్ ఫ్యామిలీతో బంధుత్వం ఉంది. చాలా ఏళ్ల క్రితం మోహన్‌బాబు టీడీపీలో కొనసాగిసిన.. ఇప్పుడు చంద్రబాబుతో ఆయనకు సన్నిహిత సంబంధాలు లేవు. గత ఎన్నికల సమయంలో మోహన్‌ బాబు.. టీడీపీకి వ్యతిరేకంగా విమర్శలు చేయడమే కాకుండా వైసీపీలో చేరి ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా నిర్వహించారు. అయితే  ప్రస్తుతం మనోజ్‌కు తన సోదరుడు  విష్ణుతో సత్సబంధాలు లేవు.

29

మరోవైపు భూమా మౌనిక కుటుంబ నేపథ్యం పూర్తిగా యాక్టివ్ పొలిటిక్స్‌తో ముడిపడి ఉంది. మౌనిక సోదరి అఖిలప్రియ, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. వీరి కుటుంబానికి నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది. ఇక, మనోజ్- మౌనికల విహహం తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

39

ఈ క్రమంలో మనోజ్-మౌనిక దంపతులు ఇటీవల తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుతో భేటీ అనంతరం.. వారి రాజకీయ ఎంట్రీకి రంగం సిద్దం చేసుకున్నారనే ప్రచారం సాగుతుంది. చంద్రబాబుతో భేటీ తర్వాత మనోజ్ చేసిన కామెంట్స్‌ కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చాయి. మంచు మనోజ్‌ జనాల్లో మంచి క్రేజ్ ఉండటం.. కొన్ని సేవా కార్యక్రమాలు  చేయడం కూడా ఆయనకు  రాజకీయంగా ఎంట్రీ ఇస్తే కలిసివచ్చే అవకాశాలుగా మారనున్నాయి. 

49

అయితే వీరు టీడీపీలో చేరతారనే ప్రచారం గట్టిగానే సాగుతున్నప్పటికీ.. ఎన్నికల్లో పోటీ చేస్తారా? చేస్తే ఎక్కడి నుంచి చేస్తారనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతుంది. దంపతుల్లో ఎవరో ఒకటిరి టీడీపీ అధిష్టానం టికెట్ ఇస్తుందని.. అయితే అది మనోజ్‌కా? లేదా మౌనికకా? అనే అంశం కూడా ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది. ఇప్పటికే మౌనిక ఫ్యామిలీ టీడీపీలోనే ఉండటం.. వారిలో ఒకరికి లేదా ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉండటంతో.. మౌనికకు కూడా టికెట్ ఇచ్చే అవకాశాలు తక్కువే అనే టాక్ వినిపిస్తోంది. 

59

మనోజ్ ఫ్యామిలీ కూడా చంద్రబాబు సొంత జిల్లా అయినా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిదే. అక్కడ మంచు ఫ్యామిలీకి చెందిన విద్యానికేతన్ విద్యాసంస్థలు ఉన్నాయి. ఇవి ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం అక్కడ వైసీపీకి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు  చెవిరెడ్డి అక్కడి నుంచి విజయం సాధించగా.. ఈసారి తన కొడుకు మోహిత్ రెడ్డిని బరిలో దింపనున్నారు. 

69

అయితే చంద్రగిరి నుంచే మనోజ్‌ను పోటీ చేయిస్తే టీడీపీకి కలిసి వస్తుందనే ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మనోజ్ టీడీపీలో చేరి.. చంద్రగిరి నుంచి పోటీ చేసేందుకు రెడీ అంటే.. టీడీపీ అధిష్టానం నుంచి ఎటువంటి అభ్యంతరం వ్యక్తం ఉండదనే వాదన వినిపిస్తోంది. 

79

అయితే ఒకవేళ మనోజ్ అందుకు అంగీకరించని పక్షంలో మౌనికకు టికెట్ ఆఫర్ అనేది రెండో ఆప్షన్ అని చెబుతున్నారు. చాలా రోజులుగా టీడీపీలోని భూమా ఫ్యామిలీకి, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఆళ్లగడ్డ లేదా నంద్యాల నుంచి తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఏవీ  సుబ్బారెడ్డి కూడా అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియాకు టికెట్ దాదాపు ఖాయంగా తెలుస్తోంది. అయితే నంద్యాల టికెట్ కూడా భూమా ఫ్యామిలీ కోరుతున్నట్టుగా తెలుస్తోంది. 
 

89

దీంతో నంద్యాల టికెట్ ఎవరికి కేటాయిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నంద్యాలలో మౌనికను బరిలో నిలిపితే.. ఏపీ సుబ్బారెడ్డి కూడా సపోర్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతుంది. అయితే మరోవైపు భూమా మౌనికా రెడ్డి నంద్యాల నుంచి పోటీలో లేరని ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి గురువారం మీడియాతో చెప్పారు. అయితే.. నంద్యాల నుంచి టీడీపీలో టికెట్ కోసం పోటీ ఉన్నదని, వైసీపీలోనూ ఆ పోటీ కనిపిస్తుందని వివరించారు.

99

రీసెంట్ గా విష్ణు - మనోజ్ మధ్య ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. మనోజ్ - మౌనికా పెళ్లి విషయంలోనే ఆ ఘర్షణలు తలెత్తాయని తెలుస్తోంది. ఈ క్రమంలో మనోజ్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారింది. తమ లవ్ ట్రాక్ పైన కూడా ‘అలా మొదలైందంటూ’ ఆసక్తి పెంచారు.  
 

Read more Photos on
click me!

Recommended Stories