కర్నూల్ లో ఏపీ హెచ్‌ఆర్‌సీ ప్రధాన కార్యాలయం... ప్రారంభించిన జస్టిస్ సీతారామమూర్తి

First Published Sep 1, 2021, 4:31 PM IST

ఆంధ్ర ప్రదేశ్ మానవ హక్కుల కమీషన్ ప్రధాన కార్యాలయం కర్నూల్ లో ప్రారంభమయ్యింది. కమీషన్ ఛైర్మన్ జస్టిస్ సీతారామమూర్తి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. 

కర్నూల్: ఆంధ్ర ప్రదేశ్ మానవహక్కుల కమీషన్ (హెచ్‌ఆర్‌సీ) కార్యాలయం కర్నూల్ లో ప్రారంభమయ్యింది. కర్నూల్ లోని ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్ లో హెచ్‌ఆర్‌సీ కార్యాలయాన్ని ఏర్పాటుచేసింది ప్రభుత్వం. దీంతో బుధవారం కమీషన్ ఛైర్మన్, సభ్యులు పూజాకార్యక్రమాలను నిర్విహించి నూతన కార్యాలయం నుండి పని ప్రారంభించారు.

ఇటీవలే హెచ్‌ఆర్‌సీ ప్రధాన కార్యాలయాన్ని కర్నూల్ కు తరలిస్తున్నట్లు జగన్ సర్కార్ ప్రకటించింది. రాష్ట్ర విభజన తర్వాత కొంతకాలం హైదరాబాద్ లోనే కొనసాగిన కార్యాలయం 2017లో విజయవాడకు తరలిస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జారీచేసిన ఉత్తర్వులను సవరిస్తూ తాజాగా సవరించిన వైసిపి సర్కార్ కార్యాలయాన్ని కర్నూల్ కు తరలించింది.

ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్ లో రూమ్ నెంబర్-1లో మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి ఛాంబర్ ను ఏర్పాటుచేశారు. ఇక రూమ్ నెంబర్-2 లో జ్యుడీషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం, రూమ్ నెంబర్-4 లో నాన్ జ్యుడీషియల్ సభ్యుడు జి.శ్రీనివాస రావు ఛాంబర్ ఏర్పాటుచేశారు.

కమీషన్ ఛైర్మన్, సభ్యులతో పాటు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు నూతన కార్యాలయానికి విచ్చేసిన కమీషన్ ఛైర్మన్, సభ్యులకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణకుంభతో స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ, రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) శ్రీనివాసులు, డి.ఆర్.ఓ పుల్లయ్య, జెడ్పి సీఈఓ వెంకటసుబ్బయ్య, కర్నూలు ఆర్.డి.ఓ హరిప్రసాద్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

click me!