చెప్పినట్టు వినాలని సీబీఐ అధికారి కొట్టారు: వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలనం

First Published | May 4, 2023, 1:12 PM IST


సీబీఐ  అధికారులు  తాము చెప్పినట్టు  వినాలని  వేధింపులకు గురి చేశారని  పీఏ  కృష్ణారెడ్డి  ఆరోపించారు.   

వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలనం

తాము చెప్పినట్టుగా  వినాలని  సీబీఐ అధికారి రాంసింగ్  తనను కొట్టారని  దివంగత  వైఎస్ వివేకానందరెడ్డి  పీఏ కృష్ణారెడ్డి ఆరోపించారు. సీబీఐ అధికారులు  చెప్పినట్టుగా  వినాలని  వైఎస్ సునీతారెడ్డి కూడ తనను బెదిరించారన్నారు.వైఎస్ వివేకానందరెడ్డి   పీఏగా  పనిచేసిన కృష్ణారెడ్డి  ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీకి  ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూలో  పలు అంశాలను  ప్రస్తావించారు. 

వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలనం

ప్రతి రోజూ  వైఎస్ వివేకానందరెడ్డి  ఇంటికి తాను  ఉదయం  ఐదున్నర గంటలకు  వెళ్లేవాడినని  కృష్ణారెడ్డి  చెప్పారు. వివేకానందరెడ్డి హత్య కు గురైన రోజున కూడా తాను  ఐదున్నర గంటలకు  చేరుకున్నట్టుగా  చెప్పారు. అయితే  వాచ్ మెన్ రంగయ్య మాత్రం  ఇంటి ముందు  పడుకున్నాడన్నారు. ప్రతి రోజూ  ఉదయం ఐదున్నర గంటల వరకు  వైఎస్ వివేకానందరెడ్డి  నిద్ర లేచేవాడన్నారు. కానీ ఆ రోజుల వైస్  వివేకానందరెడ్డి  నిద్ర లేవలేదన్నారు.


వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలనం

వివేకానందరెడ్డి  రూమ్ లో ఉన్న బాత్ రూమ్ లోకి వెళ్లే సరికి  ఆయన రక్తం మడుగులో పడి ఉన్నాడని  కృష్ణారెడ్డి  తెలిపారు. వివేకానందరెడ్డి శ్వాస తీసుకోవడం లేదని గుర్తించి వెంటనే   వైఎస్ సునీతారెడ్డి భర్త  రాజశేఖర్ రెడ్డికి ఫోన్ లో సమాచారం  ఇచ్చినట్టుగా  కృష్ణారెడ్డి  తెలిపారు.  ఆ తర్వాత  వివేకానందరెడ్డి బంధువు  శివప్రకాష్ రెడ్డికి సమాచారం ఇచ్చినట్టుగా  ఆ ఇంటర్వ్యూలో   కృష్ణారెడ్డి తెలిపారు.

వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలనం

వైఎస్ వివేకానందరెడ్డి రూమ్ లో  లెటర్ దొరికిందన్నారు. డ్రైవర్  ప్రసాద్ ను త్వరగా  రమ్మన్నందును  తనను చచ్చేలా కొట్టారని , డ్రైవర్ ను వదలొద్దు అని  ఆ లేఖలో ఉందని  కృష్ణారెడ్డి  గుర్తు  చేసుకున్నారు.ఈ లేఖ గురించి రాజశేఖర్ రెడ్డికి ఫోన్ లో  చెబితే  ఆ లేఖను దాచి పెట్టాలని తనకు  సూచించారన్నారు.  అదే సమయంలో  వైఎస్ వివేకానందరెడ్డి  ఫోన్ వస్తే  దాన్ని సైలెంట్ లో పెట్టి  తన జేబులో వేసుకున్నట్టుగా  కృష్ణారెడ్డి  చెప్పారు. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి , వైఎస్ సునీతారెడ్డి  పులివెందుల వచ్చిన తర్వాత  లెటర్ గురించి   అడిగితే  తన ఇంట్లో దాచిన లేఖను   తెచ్చి  రాజశేఖర్ రెడ్డికి అందించినట్టుగా  కృష్ణారెడ్డి చెప్పారు. ఈ లేఖను  ఎస్పీకి అందించి  నీకు  ఇబ్బంది లేదని రాజశేఖర్ రెడ్డి చెప్పారని  కృష్ణారెడ్డి ఆ ఇంటర్వ్యూలో గుర్తు  చేసుకున్నారు. 

వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలనం

ఎర్ర గంగిరెడ్డి , పులివెందుల  సీఐ  ఐదు నిమిషాలు  అటు ఇటుగా  వైఎస్ వివేకానందరెడ్డి ఇంటికి వచ్చారన్నారు.  వైఎస్ వివేకానందరెడ్డి  డెడ్ బాడీని చూడగానే  రక్తపు వాంతులు చేసుకొని చనిపోయారని ఎర్ర గంగిరెడ్డి  చెప్పారన్నారు.  తాను  ఎర్ర గంగిరెడ్డి వాదనను  కొట్టి పారేసినట్టుగా   ఆ ఇంటర్వ్యూలో  కృష్ణారెడ్డి  వివరించారు. 

వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలనం

నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి పులివెందుల సీఐ శంకరయ్యతో ఫోన్ లో మాట్లాడారన్నారు.   సీఐ సూచన మేరకు  పోలీసులకు ఫిర్యాదును  రాసి ఇవ్వాలని  రాజశేఖర్ రెడ్డి సూచించారన్నారు.అదే రోజు సాయంత్రం   తనతో పాటు  12 మందిని  పోలీసులు  కడప డీటీసీలో  ఉంచారన్నారు.   దాదాపు 12 రోజుల పాటు  తమను పోలీసులు కొట్టారని  కృష్ణారెడ్డి వివరించారు.  13 రోజుల తర్వాత ఎర్ర గంగిరెడ్డితో పాటు  తనపై కేసు నమోదు చేశారన్నారు ఆ తర్వాత  ఈ కేసును  సీబీఐకి అప్పగించారన్నారు.

వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలనం

సీబీఐ విచారణ అధికారి  రాంసింగ్ తనను న్యూఢిల్లీలో  నెల రోజుల పాటు ఉంచుకున్నారన్నారు. విచారణ పేరుతో  తనను రాంసింగ్  కొట్టారని  కృష్ణారెడ్డి  ఆరోపించారు. కడప  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మేనేజ్ చేశారని  రాంసింగ్  తనను కొట్టేవాడన్నారు.   నెల రోజుల తర్వాత  తనను వైఎస్ సునీతారెడ్డి  హైద్రాబాద్ కు పిలిపించారన్నారు.   సీబీఐ చెప్పినట్టుగా  వినాలని  వైఎస్ సునీతారెడ్డి,  నర్రెడ్డి  రాజశేఖర్ రెడ్డి  చెప్పేవారనని  కృష్ణారెడ్డి  ఆ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.  
 

వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలనం

తాము చెప్పినట్టుగా  వినాలని  సీబీఐ అధికారి  రాంసింగ్  చెప్పారన్నారు.  దస్తగిరి, రంగయ్య తాము చెప్పినట్టుగా  విన్నారని  వారిని సేవ్  చేసినట్టుగా  రాంసింగ్  బెదిరించారన్నారు.   ఇదే విషయమై  తన ఇద్దరు కొడుకుల ముందు   రాంసింగ్ తనను కొట్టారన్నారని   ఆయ న  ఆ ఇంటర్వ్యూలో  తెలిపారు.   సీబీఐ  అధికారి  రాంసింగ్ పై  కడప ఎస్పీకి కూడా ఫిర్యాదు  చేసినట్టుగా ఆయన  చెప్పారు.  కానీ కడప పోలీసులు  ఈ విషయాన్ని పట్టించుకోలేదని  ఆయన ఆ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. 
 

YS Avinash Reddy (Kadapa)

వైఎస్ అవినాష్ రెడ్డి తనను మేనేజ్ చేశారని   వైఎస్ సునీతారెడ్డి , ఆమె భర్త అప్పుడప్పుడూ  కామెంట్  చేసేవారన్నారు. తన కొడుకు  పెళ్లిని సునీతారెడ్డి  చెడగొట్టిందని  కృష్ణారెడ్డి ఆరోపించారు.వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరనే విషయమై  తనకు తెలియదన్నారు  ఈ కేసును నిష్పక్షపాతంగా  తేల్చాలని  ఆయన  కోరారు. 
 

Latest Videos

click me!