బొక్కలో దాక్కున్నా లాక్కొస్తున్న చంద్రబాబు.. వైసీపీ బ్యాచ్‌కి ఇక చుక్కలే!

First Published | Sep 5, 2024, 2:02 PM IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై, టీడీపీ కార్యాలయంపై దాడులు చేసిన వారిపై చర్యలు వేగవంతమయ్యాయి. వైసీపీ నేతలకు హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో పోలీసులు అరెస్టుల పర్వం ప్రారంభించారు. ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేసి మంగళగిరి తీసుకొచ్చారు. అరెస్టుల భయంతో మరికొందరు వైసీపీ నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న గత ఐదేళ్లలో అప్పటి అధికార పార్టీ నేతలు దాష్టీకాలకు కూటమి ప్రభుత్వం బదులు తీర్చుకుంటోంది. చంద్రబాబు లక్ష్యంగా దాడులు చేసిన వారిని వదిలిపెట్టే పరిస్థితి కనిపించడం లేదు.

Bail petition of YCP leaders dismissed

గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపై దాడి చేసిన కేసు ఇప్పుడు గట్టిగా బిగిస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఆఫీసుతో పాటు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులందరినీ అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.


Nandigam Suresh Arrest

హైకోర్టులో బెయిల్‌ నిరాకరణ నేపథ్యంలో టీడీపీ ఆఫీసులు, చంద్రబాబు నివాసంపై దాడి చేసిన వైసీపీ నేతలను పోలీసులు వరుసగా అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు ఏపీ పోలీసులు.. అయితే, కోర్టు బెయిల్‌ నిరాకరించిన వెంటనే అరెస్టు చేస్తారన్న విషయం తెలుసుకొని నందిగం సురేష్‌ ఎస్కేప్‌ అయ్యే ప్లాన్‌ వేసినట్లు తెలుస్తోంది. ఆయన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకొని.. హైదరాబాద్‌ పరారైనట్లు సమాచారం. నందిగం సురేష్‌ను అరెస్టు చేసేందుకు తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలోని ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు... అక్కడ లేరని తెలుసుకొని... వెనుదిరిగారు. ఫోన్‌ సిగ్నల్‌ ద్వారా ట్రేస్‌ చేసి.. హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లారు. అక్కడ అరెస్టు చేసి.. మంగళగిరికి తీసుకొచ్చారు.

Nandigam Suresh Arrest

ఇదే కేసులో నిందితులుగా ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కాగా, వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురాంతో పాటు నందిగం సురేష్ తదితరులను అరెస్టు చేసేందుకు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 టీంలు రంగంలోకి దిగాయి. అటు, విజయవాడలో డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మిగతా వారి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

Fast steps to arrest YCP leaders

కాగా, జగన్‌ ప్రభుత్వంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి ఇంటితో పాటు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. అప్పట్లో ఈ దాడి వ్యవహారంపై పెద్ద రచ్చ అయింది. ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ న్యాయం పోరాటం చేసింది. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ కేసు స్తబ్దుగా సాగింది. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయి.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చర్యలు చేపట్టింది. ఈ కేసును వేగవంతం చేసింది. ఈ కేసులో వైసీపీ నేతల బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో అరెస్టులకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కాగా, తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో వైసీపీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్‌, నందిగం సురేష్‌ నిందితులుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడి ఇంటిపై దాడి చేసిన కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. 

Jogi Ramesh

ఇప్పటికే అగ్రిగోల్డ్‌ భూముల కేసుకు సంబంధించి జోగి రమేశ్‌ తనయుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో అక్రమాలకు సంబంధించి మాజీ మంత్రి ఆర్కే రోజాపైనా అభియోగాలు ఉన్నాయి. రోజాకు ఇప్పటికే ఈ కేసులో సీఐడీ నోటీసులు పంపింది.

Latest Videos

click me!