తొలి ఏకాదశి పర్వదినం... భక్తులతో కిటకిటలాడుతున్న కోటప్పకొండ ఆలయం

First Published Jul 20, 2021, 12:12 PM IST

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లాలోని కొటప్పకొండ త్రికూటేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. 

గుంటూరు: మంగళవారం తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇలా గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. త్రికూటాద్రి పర్వతంపై వెలిసిన త్రికూటేశ్వర స్వామికి ప్రత్యేక పూజ ద్రవ్యములతో అభిషేకాలు నిర్వహించారు. అభిషేక మండపంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు.
undefined
తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా త్రికోటేశ్వర స్వామి మూల విరాట్ కు ప్రత్యేక పూలతో అలంకరించారు అర్చకులు. దేవాలయం అంతా కూడా అత్యంత వైభవంగా శోభాయమానంగా ముస్తాబు చేశారు. ఈ పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామి దర్శనానికి విచ్చేసి మొక్కులు తీర్చుకున్నారు.
undefined
ఆలయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేసినట్లు ఈవో అన్నపరెడ్డి రామకోటి రెడ్డి తెలిపారు. ప్రత్యేక పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల కోసం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలుఏర్పాటుచేయగా... స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం, మంచినీళ్లు పంపిణీ చేస్తున్నారు.
undefined
ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే “శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి, హరివాసరం” అని కూడా అంటారు. ఈ రోజు నుంచి మహావిష్ణువు పాల సముద్రంలో శేషపాన్పుపై శయనిస్తాడు. కనుక దీన్ని “శయన ఏకాదశి” అంటారు. ఈ ఏకాదశిని ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు. కాబట్టి ఈ రోజు దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతేగాక ఇవాళ్టి నుండి చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది.
undefined
click me!