2018లోనే కోర్టును ఆశ్రయించాం: పీపీఏలపై చంద్రబాబు

First Published Jul 18, 2019, 5:23 PM IST

పీపీఏల విషయంలో తమ ప్రభుత్వంపై జగన్ సర్కార్ చేస్తున్న విమర్శలపై చంద్రబాబునాయుడు స్పందించారు. పీపీఏల ధరలను తగ్గించాలని  కోరుతూ కోర్టును ఆశ్రయించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. 

గురువారం నాడు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత చంద్రబాబునాయుడు మీడియాతో చిట్ చాట్ చేశారు. విద్యుత్ చార్జీలను తగ్గించేందుకు తమ సర్కార్ పనిచేస్తే వైసీపీ ప్రభుత్వం తమపౌ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.
undefined
పులివెందుల తరహాలో పంచాయితీలు చేసి ప్రభుత్వ పాలనను సాగించలేరని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించారు. . రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో రియల్ ఏస్టేట్ భారీగా పడిపోయిందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు..
undefined
రాజధాని పరిధిలో దాదాపు రూ. 2 లక్షల కోట్ల విలువైన భూమి ఉన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. కానీ, జగన్ ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన తర్వాత రియల్ ఏస్టేట్ పడిపోయిందన్నారు.
undefined
షేర్ మార్కెట్ మాదిరిగా రియల్ ఏస్టేట్ రంగం మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.అమరావతి ఏరియాలో కూలీలకు కూడ పని దొరికే పరిస్థితి లేకుండా పోయిందని ఆయన చెప్పారు.
undefined
ఉండవల్లిలో తాను అద్దెకు ఉంటున్న నివాసం నదీ పరీవాహకం కిందకు రాదని చంద్రబాబు స్పష్టం చేశారు. గూగుల్‌లో చూసినా భవానీ ఐలాండ్ నుండే కృష్ణా నది ప్రవాహం కన్పిస్తోందన్నారు. ప్రకాశం బ్యారేజీ ఉన్న కారణంగానే ఒక పాయ ఇటువైపు వస్తోందన్నారు.
undefined
గన్నవరంలో విమాన రాకపోకలు తగ్గిపోయాయని చెప్పారు. పలు విమానాలు రద్దు కావడంతో ఎక్కడికి వెళ్లాలన్నా కూడ హైద్రాబాద్‌ నుండే వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.
undefined
సౌర, పవన విద్యుత్ ధరలు భారీగా తగ్గిన సమయంలో కూడ యూనిట్ విద్యుత్ ను రూ.6లకు ఏపీ సర్కార్ కొనుగోలు చేసిందని ఏపీ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. పీపీఏల విషయంలో చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది.పీపీఏలను రద్దు చేస్తే అభివృద్ది ఆగిపోతోందని తప్పుడు ప్రచారం సాగుతోందని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహదారు అజయ్ కల్లం ప్రకటించారు.
undefined
click me!