విజయవాడ చేరుకున్న రజనీకాంత్‌కు ఎన్టీఆర్ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్వాగతం పలికారు. బాలయ్యను చూడగానే సూపర్‌స్టార్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పలువురు టీడీపీ నేతలు కూడా రజనీకాంత్‌కు స్వాగతం పలికినవారిలో ఉన్నారు. అనంతరం ఇద్దరు నోవోటెల్‌కు చేరుకున్నారు. అక్కడ బాలకృష్ణ, రజనీకాంత్‌లు కాసేపు సమావేశమయ్యారు.