48 గంటల ఉత్కంఠ: పవన్ కల్యాణ్ ఉచ్చులో పడ్డ చంద్రబాబు

First Published Aug 3, 2020, 7:28 PM IST

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... అమరావతి నుండి కార్యనిర్వాహక రాజధానంటూ, న్యాయరాజధానంటూ విభజించడం అంటే అమరావతిని పక్కకు పడేయడమే అని, దీనివల్ల అక్కడివారు తీవ్రంగా నష్టపోతారని అంటున్నారు. కృష్ణ గుంటూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాలనీ ఆయన డిమాండ్ చేసారు. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారింది. జగన్ సర్కార్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో రాజకీయమంతా ఇప్పుడు అమరావతి వర్సెస్ మూడు రాజధానులుగా మారిపోయింది.
undefined
నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... అమరావతి నుండి కార్యనిర్వాహక రాజధానంటూ, న్యాయరాజధానంటూ విభజించడం అంటే అమరావతిని పక్కకు పడేయడమే అని, దీనివల్ల అక్కడివారు తీవ్రంగా నష్టపోతారని అంటున్నారు. కృష్ణ గుంటూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాలనీ ఆయన డిమాండ్ చేసారు.
undefined
ఇక నిన్న పవన్ కళ్యాణ్ అన్నాడో లేదో నేడు చంద్రబాబు ఇదే విషయాన్ని ఎత్తుకున్నారు. దమ్ముంటే మళ్ళీ ఎన్నికలకు వెళ్లాలని ఆయన సవాలు విసిరారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్.. అమరావతికి మద్దతు ఇచ్చి ఎన్నికల తర్వాత మాట తప్పారని ఆయన మండిపడ్డారు.
undefined
మాట తప్పినందుకు ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజల్లోకి వెళ్దామని సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్ విసిరారు. మూడు రాజధానులను ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదన్నారు.ఈ నిర్ణయం వల్ల ఇప్పుడు ప్రాంతాల మధ్య, కులాల, మతాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేలా ఉందని ఆయన అన్నారు.
undefined
ఇక చంద్రబాబు సవాలు విసరాగానే వైసీపీవారు సైతం కౌంటర్ బలంగానే ఇస్తున్నారు.అమరావతిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ నేతలునిప్పులు చెరిగారు.
undefined
చంద్రబాబుకు దమ్ముంటే రాజీనామా చేయాలని వైసీపీవారు సైతం సవాల్‌ విసిరారు. ప్రభుత్వం నిర్ణయం తప్పు అంటున్న చంద్రబాబు 23మంది టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ముందు మీ 23 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోండని ప్రతిసవాల్ విసిరారు.
undefined
చంద్రబాబు 48 గంటల కాలవ్యవధిని విధించారు. ఆలోపల అసెంబ్లీని రద్దుచేసి ఈన్నికలకు వెళ్లాలని సవాల్ విసరాగానే మాజీ మంత్రి యనమల సైతం... జగన్ కు చంద్రబాబు సవాల్ ని స్వీకరించాలని ఆయనొక సవాల్ విసిరారు.జగన్‌ మోసం వల్ల 13 జిల్లాల అభివృద్ధి కుంటుపడుతోందని.. భవిష్యత్ తరాలు దెబ్బతినబోతున్నాయని ఆయన అన్నారు.
undefined
జగన్ ఈ సవాల్ ను స్వీకరించడు. రాజధాని ఎక్కడుండాలి అనేది ప్రభుత్వ నిర్ణయం. ఆయన తనకున్న అధికారాన్ని ఉపయోగించుకొని రాజధానుల మార్పును చేపట్టారు. అమరావతి ఉద్యమం ప్రజాఉద్యమంగా మారలేదు.
undefined
అమరావతి ఆ పరిసర ప్రాంతాలకు మాత్రమే ఆ ఉద్యమం పరిమితమయింది. రాష్ట్రవ్యాప్తంగా అది విస్తరించనందువల్ల, మూడు రాజధానుల వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందనే విషయాన్నివైసీపీ నేతలుసైతం ప్రజలకు బలంగానే చేరేలా చేసారు
undefined
అంతేకాకుండా సంక్షేమ పథకాలు ప్రస్తుత జగన్ సర్కారుకి శ్రీరామరక్ష. సంక్షేమ పథకాలను అందరికి అందేలా చేస్తున్నారు. గ్రామా వాలంటీర్లయితేనేమి, గ్రామా కార్యదర్శులయితేనేమి ప్రభుత్వానికి మంచి మైలేజ్ నే ఇస్తున్నాయి.
undefined
ఇక చంద్రబాబు విషయానికి వస్తే... క్యాడర్ లో నీరసం అలుముకుంది. జగన్ సర్కార్ దూసుకుపోతుండడం, వారి సంక్షేమ పథకాలు టీడీపీ వారిని వారికి కౌంటర్ ఇచ్చే పరిస్థితులు కనబడడములేదు. టీడీపీ నేతలు చాలా మంది ఇప్పటికే వైసీపీలో చేరిపోయారు.
undefined
ఈ అన్ని పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు గనుక జగన్ సవాలును స్వీకరిస్తే.... టీడీపీలోని మిగిలిన కొద్దిమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడే ఆస్కారముంది. వారిప్పుడు ఎన్నికలకు వెళ్లే ఆస్కారం లేదు. మహా అయితే కృష్ణ, గుంటూరు జిల్లాల్లో కలిసి రావచ్చు. కానీ మిగిలిన రాష్ట్రమంతా టీడీపీకి వ్యతిరేక గాలులు బలంగా వీచే ఆస్కారముంది.ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆ సవాలును స్వీకరించే అవకాశాలు తక్కువ. జగన్ సైతం చంద్రబాబు సవ్వాలును స్వీకరించరు. ఈ సవాళ్ళన్నీ కూడా ఏదో ఇంకో 48 గంటలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించడానికి పనికి వస్తాయి కానీ.... వేరే ఎందుకు ఉపయోగపడేలా మాత్రం కనబడడం లేదు.
undefined
click me!