అమరావతి: చంద్రబాబు చేసిన తప్పులు ఇవీ... జగన్ అస్త్రాలు అవే....

First Published Aug 3, 2020, 3:05 PM IST

చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని పనుల నేపథ్యంలో....  అమరావతి వల్ల కేవలం ఒక సామజిక వర్గం మాత్రమే అభివృద్ధి చెందుతుందని, దాని వల్ల యావత్ రాష్ట్రానికి ఎటువంటి లాభం ఉండబోదని వైసీపీ వారు చెప్పారు. దాన్ని ప్రజలు కూడా నమ్మారు.

ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ ఆమోదముద్ర వేసినప్పటినుండి ప్రతిపక్షాలు జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. మాట తప్పారు, మడమ తిప్పారు అంటూ ప్రాసలతో ప్రభుత్వంపై తీవ్రస్థాయి ఆరోపణలు చేస్తున్నారు.
undefined
అమరావతి ప్రాంతవాసులకు అన్యాయం జరిగింది. అది వాస్తవం. వారు రాజధాని అక్కడ వస్తుందంటే... ప్రభుత్వాన్ని నమ్మి(జగన్ మోహన్ రెడ్డా, చంద్రబాబు నాయుడా అనేది పక్కనబెడితే) తమ భూములను ఇచ్చారు. ఆశపడడం మనిషి నైజం. తమకు ఉన్నదంతారాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చి,సర్వంకోల్పోయినప్పుడు వారు అభివృద్ధి ఫలాలను ఆశించడంలో తప్పులేదు కూడా!
undefined
ప్రభుత్వాన్ని నమ్మి తమ భూములను ఇచ్చినవారిపరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. వారి బ్రతుకులు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. ఈ స్థాయిలో ప్రజల బ్రతుకులు రోడ్డున పడేసిన ప్రభుత్వం వచ్చేసారి ఎన్నికల్లో గెలవకూడదు.కానీ ఆ భయం జగన్ కి ఇసుమంతయినా లేదు. మూడు రాజధానుల వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదాన్ని, అమరావతి వల్ల లాభపడేది కేవలం కొందరు మాత్రమే అనే విషయాన్ని ప్రజలు బలంగా నమ్మారు, నమ్ముతున్నారు. ఇలా నమ్మేలా చేసింది ముమ్మాటికీ గత 5 ఏండ్లుఅధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అనడంలో ఎటువంటి సంశయం లేదు.
undefined
చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని పనుల నేపథ్యంలో....అమరావతి వల్ల కేవలం ఒక సామజిక వర్గం మాత్రమేఅభివృద్ధి చెందుతుందని, దాని వల్ల యావత్ రాష్ట్రానికి ఎటువంటి లాభం ఉండబోదని వైసీపీ వారు చెప్పారు. దాన్ని ప్రజలు కూడా నమ్మారు. అందుకే అమరావతి ఉద్యమం ఆ చుట్టుపక్కల గ్రామాలకే పరిమితమయింది తప్ప బయటకు పాకింది లేదు.
undefined
ఈ నేపథ్యంలో అసలు అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పులేమిటి, అవి ఎందుకు అమరావతి విషయంలో జగన్ కు అస్త్రాలుగా మారాయనేది ఒకసారి చూద్దాము.
undefined
చంద్రబాబు కి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్అనే ఒక ఇమేజ్ ఉంది. హైటెక్ సిటీ ఏర్పాటు, సాఫ్ట్ వేర్ బూమ్ ఉన్న కాలంలో ఆయా సంస్థలను హైదరాబాద్ కి తీసుకురావడంలో చంద్రబాబు పాత్ర కీలకం. దాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడాఅనేకసార్లు ఒప్పుకుంది. అదే డెవెలప్మెంటల్ పాలిటిక్స్ ని ఆధారంగా చేసుకొనే 2014 ఎన్నికలకు వెళ్లారు.
undefined
హైదరాబాద్ ని నేను అభివృద్ధి చేశాను అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కి మరో నూతన రాజధానిని ఏర్పాటు చేస్తాను అని చెప్పారు చంద్రబాబు. అదే విషయాన్నీ ప్రజలు కూడా నమ్మారు. నమ్మి చంద్రబాబుకి ఓట్ వేశారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. రాజధాని నిర్మాణానికి తానే బ్రాండ్ అంబాసిడర్ అనే విధానాన్నిఎన్నికల వరకు వాడి వదిలేస్తే అయిపోయేది. కానీ చంద్రబాబు అలా చేయలేదు.
undefined
ఆయన గెలిచిన తరువాత కూడా అమరావతిని ఒక ప్రజల రాజధానిగా కాకుండా, తన ప్రత్యేకతగా చెప్పుకున్నారు. అమరావతి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే అమరావతి అన్నట్టుగా, నాడు హైదరాబాద్ నేడు అమరావతి అని, నవ్యాంధ్రనిర్మాత చంద్రబాబు అని ఇలా ఒక్కటేమిటి అనేక పేర్లు, కొత్త కొత్త నినాదాలతో తెగ హోరెత్తించారు.
undefined
ఇప్పుడు చంద్రబాబు చేసిన ఈ తప్పే జగన్ కి ఆయుధంగా మారింది. అమరావతి చంద్రబాబు రాజధానిగా మిగిలిపోబట్టేజగన్ అంత తేలికగా దాన్ని తరలించగలుగుతున్నాడు. అమరావతి బ్రాండ్ చంద్రబాబు ఇమేజ్ తో ముడిపడి ఉందన్న విషయం బలంగా ప్రోజెక్టు అయింది కాబట్టే జగన్ ఆ చంద్రబాబు బ్రాండ్ అయిన అమరావతిని తుడిపేయాలనుకుంటున్నాడు.
undefined
ఆయన ఇప్పుడు బ్రాండ్ చంద్రబాబు గా ఉన్న అమరావతిని నామరూపాల్లేకుండా చేసి, బ్రాండ్ జగన్ గా విశాఖను అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు. అమరావతి ప్రజా ఉద్యమం అనేది ఆ పరిసర గ్రామా ప్రాంతాలకే పరిమితమయింది తప్ప, విస్తరించలేదు. అదే ఇదొక ప్రజారాజధానిగా నిర్మించిఉంటే...ఈరోజు ప్రజావ్యతిరేకత భయానికి జగన్ ఈ సాహసం చేసేవాడు కాదు.
undefined
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న నాటినుంచే నిర్మించేది అమరావతి కాదు భ్రమరావతి అని పదే పదే ఆరోపణలు చేసారు. అక్కడ చంద్రబాబు తాత్కాలిక నిర్మాణాలే చేపట్టారు తప్ప పూర్తిగాపూర్తయ్యే విధంగా నిర్మించింది లేదు. గ్రాఫిక్స్ ను భారీ స్థాయిలోనే చూపెట్టారు, కానీ గ్రౌండ్ మీద మాత్రం నిర్మాణాలు పూర్తయి, అమరావతి చిహ్నాలుగా ఏవీ మిగల్లేదు.
undefined
చంద్రబాబు పంచవర్ష ప్రణాళికల కాకుండా ఒక 20 సంవత్సరాల ప్రణాళికగా అమరావతిని నిర్మించనారంభించారు. ప్రజలు తనకు అధికారానిచ్చింది 5 సంవత్సరాలన్న విషయాన్నీ మర్చిపోయి భారీ ప్రణాళికలను రచించారు. బహుశా ఈ నిర్మాణం అవుతుండగా ప్రజలు తనకు తప్ప వేరే ఎవరికి కూడా అధికారాన్ని కట్టబెట్టరు అని చంద్రబాబు భ్రమపడ్డారు కాబోలు!అందుకే ఈ నష్టం జరిగింది.
undefined
జగన్ ఎన్నికలప్పుడు అమరావతిలో ఎలాంటి నిర్మాణాలను చేపట్టారు అని ప్రశ్నించారు. అమరావతిలో చూపెట్టడానికి ఒక బ్రహ్మాండమైన సెక్రటేరియటో, ఇతర భారీ భవనాలను గనుక నిర్మించి ఉండిఉంటే...ఈ పరిస్థితి వచ్చేదికాదు. చంద్రబాబు ఆ పని చేయకుండా అమరావతికి భారీ స్థాయి ప్రణాళికలు రచించడం వల్ల... జగన్ దీనివల్ల ఎవరికీ లాభం అని లేవనెత్తే ప్రశ్నకు చంద్రబాబు సమాధానంగా ఏమి చూపెట్టలేకపోయారు.
undefined
ఇక జగన్ పై ఇప్పుడు మాట మార్చారు అని దాడి చేస్తున్న టీడీపీ ఆనాడు కూడా అల్ పార్టీ మీటింగ్ ని ఏర్పాటు చేసి, అందరికి ప్రాధాన్యత కల్పించిఉంటేబాగుండేది. ఆ పనిని వారు చేయలేదు. జగన్ ని అసెంబ్లీలో ఉక్కిరిబిక్కిరి చేసి ఒప్పించారు. టీడీపీ నేతల ముప్పేట దాడిలో జగన్ ఒప్పుకున్నాడు. ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది జగన్ చేస్తున్నాడు. అసెంబ్లీలో నేటి పరిస్థితి కొత్త కాదు. కేవలం ఆనాటి ప్రతిపక్షం నేడు అధికారంలో ఉంది, ఆ రోజు అన్నవారు నేడు పడుతున్నారు.
undefined
చంద్రబాబు ఆరోజున గనుక ప్రజా రాజధాని అన్నట్టుగా, అందరినీ పిలిచి ఏర్పాటు చేసి ఉంటే...నేడు ఈ రాజకీయ కక్షలకు, కార్పణ్యాలకు తావు ఉండేది కాదు. అన్నిటికంటే ముఖ్యంగా, అందరికి అన్నం పెట్టె రైతులు రోడ్లెక్కి పరిస్థితి ఉండేది కాదు..!
undefined
click me!