జిల్లాలోని తిరుపతి ఎంపీ స్థానానికి త్వరలో జరగనున్న ఎన్నికలు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్షగా మారాయి. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి. త్వరలోనే ఈ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
undefined
2019 ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో తిరుపతి ఎంపీ స్థానం నుండి బల్లి దుర్గాప్రసాద్ 2 లక్షల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఎన్నికలకు ముందే దుర్గాప్రసాద్ టీడీపీని వీడి వైఎస్ఆర్‌సీపీలో చేరారు. తిరుపతి ఎంపీ స్థానం నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తిరుపతి నుండి సిట్టింగ్ ఎంపీ వరప్రసాద్ కు కాకుండా దుర్గాప్రసాద్ కు తిరుపతి నుండి ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారు. వరప్రసాద్ ను గూడూరు నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు.
undefined
తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా డాక్టర్ గురుమూర్తిని ఆ పార్టీ ప్రకటించింది. ఎన్నికల కోసం ఆ పార్టీ నాయకత్వం ఇప్పటి నుండే కసరత్తు చేస్తోంది.
undefined
ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. చిత్తూరు జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు జిల్లాలోని 4 అసెంబ్లీ స్థానాలు ఈ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి.
undefined
2019 ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ మినహా మిగిలిన అన్ని చోట్ల కూడ వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధికే మెజారిటీ వచ్చింది. కొన్ని చోట్ల ఎమ్మెల్యే అభ్యర్ధుల కంటే ఎంపీ అభ్యర్ధికే ఎక్కువ ఓట్లు వచ్చాయి.
undefined
2019 ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యే అభ్యర్ధి భూమన కరుణాకర్ రెడ్డికి 708 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ స్థానంలో ఎంపీ అభ్యర్ధికి టీడీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి.
undefined
సత్యవేడు స్థానంలో ఎమ్మెల్యే అభ్యర్ధికి 44 వేల ఓట్ల మెజారిటీ వస్తే ఎంపీ అభ్యర్ధికి 42 వేల ఓట్ల మెజారిటీ దక్కింది. శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యే అభ్యర్ధికి 38 వేలు, ఎంపీ అభ్యర్ధికి 32 వేల ఓట్లు వచ్చాయి.
undefined
నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యే అభ్యర్ధికి 45 వేలు, ఎంపీ అభ్యర్ధికి 46 వేల ఓట్లు వచ్చాయి. సర్వేపల్లి అసెంబ్లీ స్థానంలో 14 వేలు, ఎంపీ అభ్యర్ధికి 15 వేల ఓట్లు వచ్చాయి.
undefined
సూళ్లూరుపేట అసెంబ్లీ స్థానంలో 78 వేలు, ఎంపీ అభ్యర్ధికి 57 వేల ఓట్లు వచ్చాయి. వెంకటగిరి అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యే స్థానానికి 88 వేల ఓట్లు వచ్చాయి. ఎంపీ స్థానానికి 36 వేల ఓట్లు వచ్చాయి.
undefined
గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ ఈ దఫా ఎన్నికల్లో వస్తోందా రాదా అనేది ప్రస్తుతం సర్వత్రా చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీని కాపాడుకొనేందుకు ఎమ్మెల్యేలు కష్టపడాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.
undefined
ఈ దఫా ఈ స్థానం నుండి బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధిని బరిలోకి దింపనున్నారు. టీడీపీ అభ్యర్ధిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని బరిలోకి దిగనుంది.
undefined