భారత్ జోడో యాత్ర ... కర్నూలు జిల్లాలో రాహుల్‌ గాంధీ పాదయాత్ర (ఫోటోలు)

Published : Oct 18, 2022, 03:41 PM ISTUpdated : Oct 18, 2022, 03:52 PM IST

కర్నూల్ : కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ దేశ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు భారత్ జోడో యాత్ర పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సాగే ఈ పాదయాత్ర ఇప్పటికే పలు దక్షిణాది రాష్ట్రాల్లో ముగిసి తాజాగా ఏపీలో అడుగుపెట్టింది. ఆంధ్ర ప్రదేశ్ లో పాదయాత్ర చేస్తున్న రాహుల్ ను కలిసేందుకు యువత, చిన్నారులు, కార్మికులు, కర్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ పాదయాత్రలో భారీగా పాల్గొంటున్నారు. కర్నూల్ జిల్లాలో ఈ పాదయాత్ర నాలుగు రోజులపాటు కొనసాగనుంది. 

PREV
16
భారత్ జోడో యాత్ర ... కర్నూలు జిల్లాలో రాహుల్‌ గాంధీ పాదయాత్ర  (ఫోటోలు)
Bharat jodo yatra in Andhra pradesh

భారత్ జోడో యాత్రలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో నిర్వహిస్తున్న రాహుల్ గాంధీలో కలిసి నడిచేందుకు యువతీ యువకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలామంది యువత తమ అభిమాన నాయకుడు రాహుల్ తో ఫోటోలు దిగుతున్నారు. 

26
Bharat jodo yatra in Andhra pradesh

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాదయాత్రలో చిన్నారులు సైతం పాల్గొంటున్నారు.  ఇలా కర్నూల్ జిల్లాలో ఓ చిన్నారి చేతులు పట్టుకుని రాహుల్ నడుస్తూ అందరి మనసులు గెలుచుకున్నారు. 

36
Bharat jodo yatra in Andhra pradesh

 రాహుల్ గాంధీ తనతో కలిసి పాదయాత్రలో పాల్గొంటున్న వారితో ఆత్మీయంగా వ్యవహరిస్తున్నారు. ఇలా తనను చూసేందుకు వచ్చిన  మహిళను రాహుల్ ఆత్మీయంగా హత్తుకుని యోగక్షేమాలు కనుక్కున్నారు. 

46
Bharat jodo yatra in Andhra pradesh

భారత్ జోడో యాత్రలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో నిర్వహిస్తున్న రాహుల్ గాంధీలో కలిసి నడిచేందుకు యువతీ యువకులు ఆసక్తి చూపిస్తున్నారు.  

56
Bharat jodo yatra in Andhra pradesh

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో కలిసి నడుస్తూ సాంప్రదాయ నృత్యకారిణి  వేషధారణలో ఓ చిన్నారి ఆకట్టుకుంది. ఇలా చిన్నాపెద్ద తేడాలేకుండా అందరిని కలుస్తూ, అందరితో ఆత్మీయంగా మాట్లాడుతూ ముందుకు కదిలారు రాహుల్. 

66
Bharat jodo yatra in Andhra pradesh

భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీలో చేపడుతున్న పాదయాత్రలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఏపి పిసిసి చీఫ్ శైలజానాథ్ తో పాటు కీలక నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు.  

click me!

Recommended Stories