పక్కా వ్యూహంతో సోము వీర్రాజు దూకుడు: జీవీఎల్ ఔట్, రామ్ మాధవ్ ఇన్

First Published Jul 31, 2020, 11:30 AM IST

రాజధాని విషయంలో సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత కూడా సుజనా చౌదరి తన వాదన వినిపించారు. ఆయన ప్రకటన చేసిన కొన్ని గంటల్లో పార్టీ వైఖరిని స్పష్టం చేస్తూ బిజెపి ట్వీట్ చేసింది. 

ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా నియమితులైన వెంటనే సోము వీర్రాజు దూకుడు ప్రదర్శిస్తున్నారు. వివిధ అంశాలపై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్పష్టమైన విధానాలను తెలియజేస్తూ అయోమయం లేకుండా చూసే కార్యక్రమాన్ని ఆయన తొలుత చేపట్టినట్లు కనిపిస్తున్నారు. ఆయన వచ్చేంత వరకు రాజధాని విషయంలో పార్టీ శ్రేణుల్లో కేంద్ర వైఖరిపై, రాష్ట్ర పార్టీ వైఖరిపై గందరగోళం కొనసాగుతూ వచ్చింది.
undefined
పార్టీ ఎంపీ సుజనా చౌదరి వంటి నాయకులు చేస్తున్న ప్రకటనలకు, ఇతర నాయకులు చేస్తున్న ప్రకటనలకు పొంతన లేకపోవడం, దానివల్ల పార్టీ విధానమేమిటో స్పష్టత లేకపోవడం వంటి కారణాలతో బిజెపి శ్రేణుల్లో అయోమయం కొనసాగుతూ వచ్చింది. రాజధాని విషయంలో బిజెపి ఎంపీ జీవిఎల్ నరసింహారావు ఎప్పటికప్పుడు ప్రకటనలు చేసినప్పటికీ సుజనా చౌదరి తన వాదనను వినిపిస్తూనే వచ్చారు.
undefined
రాజధాని విషయంలో తగిన సమయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని సుజనా చౌదరి పదే పదే చెబుతూ వచ్చాడు. పదే పదే ఆయన చెప్పడం వల్ల, గత బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆ విషయంపై స్ఫష్టంగా చెప్పకపోవడం పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఈ స్థితిలోనే సుజనా చౌదరితో పాటు కన్నా లక్ష్మినారాయణ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు గూటి పక్షి అనే వ్యాఖ్యలు వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి వంటివారి నుంచి వచ్చాయి.
undefined
రాజధాని విషయంలో సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత కూడా సుజనా చౌదరి తన వాదన వినిపించారు. ఆయన ప్రకటన చేసిన కొన్ని గంటల్లో పార్టీ వైఖరిని స్పష్టం చేస్తూ బిజెపి ట్వీట్ చేసింది. సోము వీర్రాజు చెప్పిందే పార్టీ వైఖరి అంటూ సుజనా చౌదరి వ్యాఖ్యలను నిర్ద్వంద్వంగా ఖండించింది. దీంతో సుజనా చౌదరి వంటివారికి పార్టీలో కళ్లెం వేయడానికి సోము వీర్రాజు సిద్ధపడినట్లు తెలుస్తోంది.
undefined
గతంలో ఏపీ పార్టీ వ్యవహారాలపై, రాష్ట్రంలోని పరిస్థితులపై జీవీఎల్ నరసింహా రావు ముందుండి వ్యాఖ్యలు చేసేవారు. ఏపీలో బిజెపికి తానే పెద్ద దిక్కు అన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే, గత కొంత కాలంగా ఆయన కనిపించడం లేదు. ఏపీ వ్యవహారాలపై మాట్లాడడం లేదు. దాన్ని బట్టి జీవీఎల్ నరసింహా రావును పక్కన పెట్టి రామ్ మాధవ్ ను బిజెపి నాయకత్వం ముందుకు తెస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.
undefined
రామ్ మాధవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించబోతున్నట్లు సోము వీర్రాజు ట్వీట్ కూడా సంకేతాలు ఇస్తోంది. కొద్ది సమయం క్రితం రామ్ మాధవ్ గురించి సోము వీర్రాజు ట్వీట్ చేశారు. తాను బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను కలిశానని, ఆయనతో మాట్లాడిన ప్రతిసారీ ఓ మేధావితో తనకు అత్యంత సన్నిహిత సంబంధం ఉన్నాననే భావన కలుగతుందని సోము వీర్రాజు అన్నారు. దేశం, పార్టీ అభివృద్ధి కోసం రామ్ మాధవ్ ఆలోచన ప్రక్రియ, ఉద్దేశ్యాలు, విజన్ తనకు స్ఫూర్తిని ఇస్తాయని ఆయన అన్నారు.
undefined
సోము వీర్రాజు ట్వీట్ ను బట్టి చూస్తే రామ్ మాధవ్ తో కలిసి ఏపీలో బిజెపిని ముందుకు నడిపించే కార్యక్రమాన్ని సోము వీర్రాజు తీవ్రంగానే తీసుకుంటున్నట్లు అర్థమవుతోంది. పైగా, ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో వారిద్దరు స్పష్టమైన వైఖరితో ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ముందు టీడీపీని పక్కకు తోసి, వైసీపీకి తామే ప్రత్యామ్నాయమనే భావనను ప్రజలకు కల్పించడం వారి ఉద్దేశంగా కనిపిస్తోంది.
undefined
click me!