సీఎం జగన్ గొప్పమనసు... యువతి పైలట్ కలకు రెక్కలుతొడుగుతూ అద్భుత సాయం

Published : Aug 08, 2023, 01:52 PM IST

ఇప్పటికే పాలకొల్లుకు చెందిన జాహ్నవి ఉన్నత చదువులకు వైసిపి ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థికసాయం చేసింది. అయితే తన కలను సాకారం చేసుకునేందుకు మరింత ఆర్థిక సాయం కావాలంటూ ఆమె ఇవాళ సీఎం జగన్ ను కలిసింది. 

PREV
15
సీఎం జగన్ గొప్పమనసు... యువతి పైలట్ కలకు రెక్కలుతొడుగుతూ అద్భుత సాయం
YS Jagan

రాజమండ్రి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఓ పేద విద్యార్థి పెద్ద కలను సాకారం చేసేందుకు ఇప్పటికే భారీగా ఆర్థికసాయం చేసింది వైసిపి ప్రభుత్వం. అయితే తన లక్ష్యం నెలవేరాలంటే మరిన్ని డబ్బులు కావాలని... దయచేసి సాయం చేయాలని యువతి సీఎంను కోరింది. దీంతో మరింత సాయం అందిస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.    
 

25
YS Jagan

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన శ్రావణి చదవులో మంచి చురుకైన అమ్మాయి. పైలట్ కావాలన్న ఆమె కలను ఆర్థికకష్టాలు అడ్డుపడ్డాయి. కానీ ఎలాగయినా తన లక్ష్యాన్ని సాధించాలని పట్టుదలతో వున్న శ్రావణికి తల్లిదండ్రులు అండగా నిలిచారు. గతేడాది జూలైలో రాజమండ్రి పర్యటనకు వచ్చిన సీఎం జగన్ ను తల్లిదండ్రులతో పాటు కలిసింది శ్రావణి. తన ఉన్నత చదువుకు ఆర్థిక సాయం చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారు జగన్.దీంతో శ్రావణి ఏవియేషన్ శిక్షణకు వైసిపి ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సాయం చేసింది. 

35
YS Jagan

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రోత్సాహంతో ఏవియేషన్ శిక్షణ ప్రారంభించిన జాహ్నవి అంతర్జాతీయ స్థాయిలో అద్భుతాలు సృష్టించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన  ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న మొదటి బారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. 

45
YS Jagan

అయితే ఇలా ఎంత ప్రతిభ వున్నా పైలట్ శిక్షణ పొందేందుకు భారీగా ఖర్చుచేయాల్సి వుంటుంది. దీంతో ఫ్లోరిడాలో కమర్షియల్‌ పైలెట్‌ శిక్షణ నిమిత్తం అవసరమైన ఆర్ధిక సాయం చేయాలని సీఎం జగన్ ను మరోసారి విజ్ఞప్తి చేసింది జాహ్నవి. మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సాయంతో మరోసారి సీఎంను కలిసింది జాహ్నవి. ఆమె విజ్ఞప్తిని మన్నించిన సీఎం ఆర్థికసాయంపై సానుకూలంగా స్పందించారు. 
 

55
YS Jagan

ఇవాళ కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఇందుకోసం రాజమండ్రికి వచ్చిన సీఎం జగన్ ను జాహ్నవి కలిసింది. భారత సంతతి వ్యోమగాములు  కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్‌ ల స్పూర్తితో ముందుకు వెళుతున్నట్లు జాహ్నవి వివరించింది.  


 

click me!

Recommended Stories