చైనా మొబైల్ తయారీ దిగ్గజం వన్‌ప్లస్ సరికొత్త ఫీచర్లతో వన్‌ప్లస్ 7 ప్రోను మార్కెట్లోకి తీసుకువస్తోంది. వన్‌ప్లస్ 6కు సక్సెసర్‌గా ఈ కొత్త ఫోన్‌ను త్వరలో తీసుకురానుంది. ఫాస్ట్ అండ్ స్మూత్ ట్యాగ్‌తో మే నెలలోనే విడుదల కానుంది.
ముంబై: చైనా మొబైల్ తయారీ దిగ్గజం వన్‌ప్లస్ సరికొత్త ఫీచర్లతో వన్‌ప్లస్ 7 ప్రోను మార్కెట్లోకి తీసుకువస్తోంది. వన్‌ప్లస్ 6కు సక్సెసర్‌గా ఈ కొత్త ఫోన్‌ను త్వరలో తీసుకురానుంది. ఫాస్ట్ అండ్ స్మూత్ ట్యాగ్‌తో మే నెలలోనే విడుదల కానుంది.
వన్ ప్లస్ సీఈఓ పీట్ లౌ.. వన్‌ప్లస్ 7 టీచర్‌ను విడుదల చేశారు. తమ సంస్థ నుంచి సరికొత్త ఫోన్‌ను అందిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఫాస్ట్ అండ్ స్మూత్ పదాలకు కొత్త నిర్వచనం చెబుతుందని, ఈ ఫోన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
మే 14న బెంగళూరులో జరిగే ఈవెంట్లో వన్‌ప్లస్ 7 ప్రో లాంచ్ చేయనుంది.
వన్‌ప్లస్ 7 ప్రో 5జీ పేరుతో మూడు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా, ఈ ఈవెంట్లో పాల్గొనేవారికి కంపెనీ ఓచర్లను అందిస్తోంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఫోన్లను విక్రయించనుంది.
మే 4 నుంచి రూ. 1000తో ప్రీ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది వన్‌ప్లస్. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఈ అవకాశం అందుబాటులో ఉంది. ఈ బుకింగ్ ద్వారా 15వేల రూపాయల స్క్రీన్ రిప్లేస్‌మెంట్ సదుపాయం ఆరు నెలలవరకు ఉచితంగా అందిస్తోంది.
వన్‌ప్లస్ 7 ప్రో ఫీచర్లు దాదాపు ఇలా ఉండొచ్చు
6.7 అంగుళాల డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్
3120x1440 పిక్సెల్స్ రిజల్యూషన్
6/12 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్,
48,+8 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ