అమెజాన్ భారీ ఆఫర్: వన్ ప్లస్ 6టీపై రూ. 10వేల తగ్గింపు

By rajashekhar garrepally  |  First Published May 3, 2019, 3:51 PM IST

చైనా మొబైల్ తయారీ దిగ్గజం వన్ ప్లస్ ఇటీవలే తీసుకొచ్చిన స్మార్ట్ ఫోన్ ధరను భారీగా తగ్గించింది. అమెజాన్ సమ్మర్ సేల్‌లో భాగంగా వన్ ప్లస్ 6టీ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ వేరియంట్ ధరను రూ. 9వేల తగ్గింపు ధరతో అందిస్తోంది. దీంతో రూ. 32,999కే ఈ ఫోన్ లభిస్తోంది.


ముంబై: చైనా మొబైల్ తయారీ దిగ్గజం వన్ ప్లస్ ఇటీవలే తీసుకొచ్చిన స్మార్ట్ ఫోన్ ధరను భారీగా తగ్గించింది. అమెజాన్ సమ్మర్ సేల్‌లో భాగంగా వన్ ప్లస్ 6టీ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ వేరియంట్ ధరను రూ. 9వేల తగ్గింపు ధరతో అందిస్తోంది. దీంతో రూ. 32,999కే ఈ ఫోన్ లభిస్తోంది.

అంతేగాక, అదనంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా జరిపే కొనుగోళ్లపై మరో రూ. 1500 డిస్కౌంట్ కూడా అందిస్తోంది. అంటే మొత్తం రూ. 10,500ల భారీ తగ్గింపు లభిస్తోందన్నమాట. దీంతో ఈ ఫోన్ రూ.31,499కే లభిస్తోంది.
మే 4 నుంచి మే 7 వరకు నాలుగు రోజులపాటు ఈ తగ్గింపు ధర అందుబాటులో ఉండనుంది. 

Latest Videos

అయితే, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర మాత్రం 37,999గా ఉంది. ఇది ఇలావుంటే, మే 14న వన్ ప్లస్ 7 పేరుతో మరో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేయనుంది. 

వన్ ప్లస్ 6టీ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6.41అంగుళాల ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే (రిజల్యూషన్ 2340x1080). వెనుకవైపు డ్యూయల్ కెమెరాలున్నాయి. ఒకటి 16ఎంపీ, మరోటి 20ఎంపీ. ఫ్రంట్ కెమెరా 16ఎంపీ. ఇన్ని ఫీచర్లున్న ఈ ఫోన్‌పై భారీ ఆఫర్లు ప్రకటించడంతో వినియోగదారులు పోటీపడే అవకాశం లేకపోలేదు.

చదవండి: అమెజాన్ సమ్మర్ సేల్ షురూ: స్మార్ట్‌ఫోన్లు, ఇతరాలపై భారీ తగ్గింపు

click me!