రెడ్‌మి ఫాస్ట్‌ చార్జింగ్‌ పవర్‌ బ్యాంక్‌లను లాంచ్‌ చేసిన షియోమీ

Published : Feb 11, 2020, 05:27 PM ISTUpdated : Feb 11, 2020, 05:32 PM IST
రెడ్‌మి ఫాస్ట్‌ చార్జింగ్‌ పవర్‌ బ్యాంక్‌లను లాంచ్‌ చేసిన షియోమీ

సారాంశం

 కొత్త రెడ్‌మి బ్రాండెడ్ పవర్ బ్యాంకులను ఈ రోజు భారతదేశంలో లాంచ్ చేసింది. రెడ్‌మి పవర్ బ్యాంక్  రెండు వేరియంట్లలో లభిస్తుంది. 10,000 ఎమ్ఏహెచ్ ఇంకా  20,000 ఎమ్ఏహెచ్ కపాసిటీ.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రెడ్‌మి ఇప్పుడు కొత్త రెడ్‌మి బ్రాండెడ్ పవర్ బ్యాంకులను ఈ రోజు భారతదేశంలో లాంచ్ చేసింది. రెడ్‌మి పవర్ బ్యాంక్  రెండు వేరియంట్లలో లభిస్తుంది. 10,000 ఎమ్ఏహెచ్ ఇంకా  20,000 ఎమ్ఏహెచ్ కపాసిటీ. రెడ్‌మి 10,000 ఎమ్ఏహెచ్ మోడల్ 10W ఛార్జింగ్ స్పీడుతో గరిష్టంగా ఉంటుంది. అయితే  20,000 ఎమ్ఏహెచ్ వేరియంట్ 18W ఛార్జింగ్ స్పీడుతో  వస్తుంది.

కొత్త రెడ్‌మి పవర్ బ్యాంకులు రెండూ బ్లాక్, వైట్ కలర్  ఆప్షన్స్ లో వస్తుంది. యుఎస్‌బి టైప్-ఎ, యుఎస్‌బి టైప్-సి ఇంటర్‌ఫేస్ రెండింటికీ డ్యూయల్ ఇన్‌పుట్ / అవుట్పుట్ పోర్ట్‌లను కలిగి ఉంటాయి.ఈ పవర్ బ్యాంకులు రెండు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో 12-లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కూడా ఉంది.

also read ఆ వెబ్‌సైట్లలో మీరు ఏదైనా కొంటే బాదుడే..!

10,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన రెడ్‌మి పవర్ బ్యాంక్ ధర రూ. 799 కాగా, 20,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన పవర్ బ్యాంక్ ధర రూ. 1,499. ఇది బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 12గంటలకు(మధ్యాహ్నం) IST నుండి ఎం‌ఐ.కామ్ ఆన్‌లైన్ స్టోర్, దేశవ్యాప్తంగా ఎం‌ఐ హోమ్ స్టోర్స్ ద్వారా అందుబాటులో ఉంటుంది.

రెడ్‌మి పవర్ బ్యాంక్ త్వరలో అమెజాన్ ద్వారా కూడా లభిస్తుందని షియోమి తెలిపింది. రెడ్‌మి రెండు  పవర్ బ్యాంకుల డిజైన్‌  బ్లాక్‌ బిల్డ్‌ను కలిగి ఉంటాయి. ఇవి చేతిలో పట్టు కోసం రన్నింగ్ లైన్స్ కలిగి ఉంటాయి. ఇది డ్యూయల్ యుఎస్బి టైప్-ఎ ఇన్పుట్ పోర్టులు, మైక్రో-యూ‌ఎస్‌బి అవుట్ పుట్ పోర్ట్, యుఎస్‌బి టైప్-సి అవుట్పుట్ పోర్ట్ కూడా కలిగి ఉంది.

also read నాయిస్ బ్రాండ్ నుండి బ్లూటూత్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్ లాంచ్...

రెడ్‌మి పవర్ బ్యాంక్ 10,000 ఎంఏహెచ్ వేరియంట్ 10W అవుట్‌పుట్‌ను,  20,000 ఎంఏహెచ్ వెర్షన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది.ఛార్జింగ్ యాక్సెసరీ 12-లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్ హార్డ్‌వేర్‌ను ఉపయోగించిందని, ఇందులో లిథియం పాలిమర్ బ్యాటరీలను కలిగి ఉందని, ఇవి లి-అయాన్ బ్యాటరీలతో పోలిస్తే సురక్షితమైనవి ఇంకా సమర్థవంతమైనవి అని పేర్కొంది.

ముఖ్యంగా రెడ్‌మి పవర్ బ్యాంక్ రెండు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది అంటే ఫోన్  ఛార్జింగ్ తో పాటు పవర్ బ్యాంక్  కూడా ఏక కాలంలో ఛార్జ్  చేయవచ్చు.అంతేకాకుండా బ్లూటూత్ హెడ్‌సెట్ లేదా ఫిట్‌నెస్ బ్యాండ్ వంటి  డివైజ్ లను ఛార్జ్ చేయడానికి పవర్ బటన్‌ను డబుల్-ట్యాప్ చేయడం ద్వారా లో పవర్ మోడ్ ఆక్టివేట్ అయ్యి చార్జ్  చేస్తుంది.

PREV
click me!

Recommended Stories

Price Drop on TVs : శాంసంగ్ స్మార్ట్ టీవిపై ఏకంగా రూ.17,000 తగ్గింపు.. దీంతో మరో టీవి కొనొచ్చుగా..!
Best Smartphones : 2025లో టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ఐఫోన్ నుంచి ఐక్యూ వరకు పూర్తి వివరాలు !