'క్విక్ వేక్' ఫీచర్ తో షియోమి ఎం‌ఐ కొత్త ఎడిషన్ టివి..

By Sandra Ashok KumarFirst Published Aug 25, 2020, 11:01 AM IST
Highlights

 కొత్త టెలివిజన్ గురించి పెద్దగా వివరాలను వెల్లడించనప్పటికి, టెలివిజన్ విభాగంలో ఇది సంస్థ యొక్క లేటెస్ట్ ప్రీమియం టి‌వి అయ్యే అవకాశం ఉంది. షియోమి అంతకుముందు పెద్ద టెలివిజన్ ప్రారంభించి కొన్ని నెలలు అయ్యింది.

చైనా ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమి సెప్టెంబర్ 7న ఎం‌ఐ టీవీ హారిజోన్ ఎడిషన్‌ను భారత్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కొత్త టెలివిజన్ గురించి పెద్దగా వివరాలను వెల్లడించనప్పటికి, టెలివిజన్ విభాగంలో ఇది సంస్థ యొక్క లేటెస్ట్ ప్రీమియం టి‌వి అయ్యే అవకాశం ఉంది.

షియోమి అంతకుముందు పెద్ద టెలివిజన్ ప్రారంభించి కొన్ని నెలలు అయ్యింది, కొత్త ఎం‌ఐ టివి హారిజోన్ ఎడిషన్ భారతదేశంలో పండుగ సీజన్ అమ్మకాలకు సిద్దంగా ఉంటుంది. హారిజన్ ఎడిషన్ టివిని షియోమి ఇండియా టీజర్ పేజీ ద్వారా వెల్లడించింది,  

దీని లాంచ్ తేదీతో పాటు కొన్ని కొత్త ఫీచర్లును సూచిస్తుంది. టెలివిజన్ ప్రీమియం స్క్రీన్  ‘క్వింటెన్షియల్ డిస్‌ప్లే టెక్’ కలిగి ఉండవచ్చని, ఇది ఎల్‌ఈ‌డి స్క్రీన్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ,  క్యూఎల్‌ఈ‌డి లేదా ఓ‌ఎల్‌ఈ‌డి  టి‌వి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

also read 

ఇంకా టీవీకి ప్యాచ్‌వాల్ లాంచర్ ఉంటుంది, 5వెలకి పైగా యాప్స్ కి అక్సెస్ అందిస్తుందని తెలిపింది, ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్ కోసం గూగుల్ ప్లే స్టోర్‌కు అక్సెస్ చేస్తుందని సూచిస్తుంది. చివరగా ‘క్విక్ వేక్’ ఫీచర్ కూడా ఉండొతున్నట్లు తెలుస్తుంది,

షియోమి స్టాండ్‌బై మోడ్ నుండి టీవీని త్వరగా ఆన్ చేసే మార్గాన్ని అమలు చేస్తున్నట్లు సూచిస్తుంది. పాత షియోమి టీవీ మోడల్స్ లో ‘క్విక్ వేక్’ ఫీచర్ లేకపోవడంతో చాలా మంది విమర్శలు చేశారు, టీవీ స్విచ్ ఆన్ చేసిన ప్రతిసారీ పూర్తిగా రీబూట్ చేయడానికి 45 సెకన్ల సమయం పడుతుంది అని చెప్పారు.

షియోమి ఇటీవల విడుదల చేసిన ఎం‌ఐ నోట్ బుక్ 14 హారిజోన్ ఎడిషన్ నుండి ‘హారిజన్ ఎడిషన్’ బ్రాండింగ్ తీసుకుంటుంది, ఇది సన్నని బెజెల్స్‌తో అధిక స్క్రీన్-టు-బాడీ రెశ్యో కలిగి ఉంటుంది. ఎం‌ఐ టీవీ హారిజోన్ ఎడిషన్ బ్రాండింగ్, టీజర్‌లోని ఇమేజ్ ఆధారంగా డిజైన్‌ ఉంటుంది, చుట్టూ స్లిమ్ బెజెల్స్‌తో పాటు మొత్తం స్లిమ్ డిజైన్ తో వస్తుంది.
 

click me!