5జి సపోర్టుతో రియల్‌మి ఎక్స్ 7 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్.. ఎప్పుడంటే ?

By Sandra Ashok Kumar  |  First Published Aug 20, 2020, 1:17 PM IST

కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో రియల్‌మీ ఎక్స్ 7, రియల్‌మీ ఎక్స్ 7 ప్రో స్మార్ట్ ఫోన్స్  ఉన్నాయి. ఈ రెండూ 5జి సపోర్ట్ తో వస్తున్నాయి. రియల్‌మీ ఎక్స్‌7 సిరీస్ 120 హెర్ట్జ్ డిస్‌ప్లేతో, హోల్-పంచ్ డిజైన్‌తో పాటు కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో సన్నని బెజెల్స్‌ను అందించే అవకాశం ఉంది. 


స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ  కొత్త ఎక్స్‌7 సిరీస్‌ సెప్టెంబర్ 1న ప్రారంభించనున్నట్లు టీజర్ ద్వారా కంపెనీ బుధవారం ప్రకటించింది. కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో రియల్‌మీ ఎక్స్ 7, రియల్‌మీ ఎక్స్ 7 ప్రో స్మార్ట్ ఫోన్స్  ఉన్నాయి. ఈ రెండూ 5జి సపోర్ట్ తో వస్తున్నాయి.

రియల్‌మీ ఎక్స్‌7 సిరీస్ 120 హెర్ట్జ్ డిస్‌ప్లేతో, హోల్-పంచ్ డిజైన్‌తో పాటు కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో సన్నని బెజెల్స్‌ను అందించే అవకాశం ఉంది. రియల్‌మీ ఎక్స్ 7 సిరీస్ ప్రస్తుతం ఉన్న రియల్‌మీ ఎక్స్‌3 సిరీస్‌కు  తర్వాతి వెర్షన్‌గా   లాంచ్ కాబోతున్నాయి.

Latest Videos

ఒక టీజర్ ప్రకారం రియల్‌మీ ఎక్స్7 సిరీస్ 120 హెర్ట్జ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇప్పటివరకు 120Hz LCD ప్యానెల్‌లతో రియల్‌మీ ఎక్స్‌3, ఎక్స్‌3 X3 సూపర్‌జూమ్‌తో ఉన్నందున ఇది కంపెనీ పోర్ట్‌ఫోలియోలో మొదటిది.

also read 

రియల్‌మీ విడుదల చేసిన టీజర్  ప్రకారం ఎక్స్‌ 7తో పాటు రియల్‌మీ ఎక్స్‌ 7ప్రో కూడా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది. అదనంగా కొత్త సిరీస్‌లో తదుపరి తరం సెల్యులార్ నెట్‌వర్క్  5జి  సపోర్ట్ హైలైట్ చేస్తూ చూపించింది.

రియల్‌మీ ఎక్స్‌7 సిరీస్ సెప్టెంబర్ 1న చైనాలో మధ్యాహ్నం 2 గంటలకు ఆసియాలో (ఉదయం 11:30 గంటలకు) లో లాంచ్ జరుగుతుంది. అయితే గ్లోబల్ లాంచ్ గురించి వివరాలు లేవు. రియల్‌మీ ఎక్స్7 సిరీస్  ఫీచర్స్ ఇంకా వెల్లడించలేదు.

అయితే ఇటీవల కొన్ని పుకార్లను బట్టి కొత్త ఫోన్లు 65W ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. ఈ ఫోన్ 200 గ్రాముల కన్నా తక్కువ బరువు ఉంటుంది.

రియల్‌మీ ఎక్స్‌ 7 ప్రో కొత్త సిరీస్‌లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఎక్స్‌ 7లో 4,300 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. ఎక్స్ 7 సిరీస్ లో మల్టీ బ్యాక్ కెమెరాలతో ఎక్స్ 3 మోడళ్లలో కనిపించే గ్రేడియంట్ బ్యాక్ డిజైన్‌ వచ్చే అవకాశం ఉంది.

click me!