ఈ ఫోన్ తో హార్ట్‌రేట్‌, బీపీ తెలుసుకోవచ్చు.. ఎలా అనుకుంటున్నారా ?

By Sandra Ashok Kumar  |  First Published Aug 21, 2020, 3:11 PM IST

 అత్యధునిక ఫీచర్లు, స్మార్ట్ ఆప్షన్స్ తో రకరకాల స్మార్ట్ ఫోన్ సంస్థలు యూసర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా ప్రపంచంలోనే  మొట్టమొదటిసారి హార్ట్‌రేట్‌, బీపీ సెన్సార్‌తో పల్స్‌ ఫీచర్‌ తో కొత్త ఫోన్‌ను ఇండియాలో ఆవిష్కరించింది. 


న్యూఢిల్లీ: ఈ జనరేషన్ లో స్మార్ట్ ఫోన్ తో ఎన్నో పనులు ఇంటి నుండే చేసుకునేందుకు ఎంతో సహాయపడుతుంది. అత్యధునిక ఫీచర్లు, స్మార్ట్ ఆప్షన్స్ తో రకరకాల స్మార్ట్ ఫోన్ సంస్థలు యూసర్లను ఆకట్టుకుంటున్నాయి.

అయితే తాజాగా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా ప్రపంచంలోనే  మొట్టమొదటిసారి హార్ట్‌రేట్‌, బీపీ సెన్సార్‌తో పల్స్‌ ఫీచర్‌ తో కొత్త ఫోన్‌ను ఇండియాలో ఆవిష్కరించింది. ఈ ఫోన్‌ ద్వారా యూజర్లు తమ గుండె ఆరోగ్యాన్ని కేవలం సెకన్లలోనే తెలుసుకోవచ్చు అని తెలిపింది.

Latest Videos

ఫోన్‌లో హార్ట్‌రేట్‌, బీపీని మానిటర్‌ చేసే ఆప్షన్స్ ఉంటాయి.  ఈ సెగ్మెంట్‌లో ఇలాంటి ప్రత్యేకతలు కలిగిన మొదటి ఫీచర్‌ ఫోన్‌ ఇదే కావడం విశేషం. దీన్ని ఉపయోగించడం  కూడా ఎంతో సులభం.  

also read “సంథింగ్ బిగ్ ఈజ్ కమింగ్” : మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ద్వారా లాంచ్.. ...

పల్స్‌ స్కానర్‌పై  చేతి వేలిని ఉంచిన   వెంట‌నే హార్ట్‌రేట్‌, బీపీలను డిస్‌ప్లేపై వెంటనే  చూపిస్తుంది. భవిష్యత్‌ అవసరాల కోసం  ఆరోగ్య  వివ‌రాల‌ను ఫోన్‌లో సేవ్ కూడా చేసుకోవ‌చ్చు అని తెలిపింది. ఆ డేటాను మెసేజ్‌ల రూపంలో ఇత‌ర ఫోన్లకు కూడా సెండ్ చేయవచ్చు.

ఇందులో అమర్చిన 1,800mAh కెపాసిటీ గల బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 6 రోజుల పాటు పనిచేస్తుంది.  లావా పల్స్‌ ఫీచర్ ఫోన్  ధర రూ.1,599. రోజ్‌ గోల్డ్‌ కలర్‌లో మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ద్వారా  దేశవ్యాప్తంగా రిటైల్‌ దుకాణాల్లో అందుబాటులో ఉంది. 

click me!