షియోమీ ఎం‌ఐ ల్యాప్‌టాప్‌ల డిస్కౌంట్ సేల్.. కొద్దిరోజులు మాత్రమే..

By Sandra Ashok Kumar  |  First Published Jul 11, 2020, 4:47 PM IST

 గతనెలలో ఈ ల్యాప్‌టాప్‌ లాంచ్ అయిన సంగతి మీకు తెల్సిందే కానీ ఇప్పుడు ఇవి లిమిటెడ్ పీరియడ్ డిస్కౌంట్ ఆఫర్ తో వస్తున్నాయి. జూలై 16 వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎం‌ఐ నోట్‌బుక్ 14, ఎం‌ఐ నోట్‌బుక్ 14 హారిజోన్ ఎడిషన్ నిన్న మధ్యాహ్నం 12 గంటలకు (మధ్యాహ్నం) అమెజాన్, ఎం‌ఐ.కామ్ ద్వారా సేల్స్ ప్రారంభించింది. 


చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ ఎంఐ  రెండు కొత్త ల్యాప్‌టాప్‌ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతనెలలో ఈ ల్యాప్‌టాప్‌ లాంచ్ అయిన సంగతి మీకు తెల్సిందే కానీ ఇప్పుడు ఇవి లిమిటెడ్ పీరియడ్ డిస్కౌంట్ ఆఫర్ తో వస్తున్నాయి. జూలై 16 వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఎం‌ఐ నోట్‌బుక్ 14, ఎం‌ఐ నోట్‌బుక్ 14 హారిజోన్ ఎడిషన్ నిన్న మధ్యాహ్నం 12 గంటలకు (మధ్యాహ్నం) అమెజాన్, ఎం‌ఐ.కామ్ ద్వారా సేల్స్ ప్రారంభించింది. సన్నగా, తేలికైనా  ల్యాప్‌టాప్‌లను జూన్ ఆరంభంలో ఇండియాలో లాంచ్ చేశారు. ల్యాప్‌టాప్‌ సన్నని బెజెల్స్‌, 10వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లతో పాటు, ఎన్విడియా జిఫోర్స్ గ్రాఫిక్స్ కార్డు ఆప్షన్ కూడా ఉంది.

Latest Videos

ఎం‌ఐ ల్యాప్‌టాప్‌లు మల్టీ కాన్ఫిగరేషన్‌లలో వస్తాయి, ప్రతిదానికి ఒకే కలర్ ఆప్షన్ ఉంటుంది. ఎం‌ఐ నోట్‌బుక్ 14, ఎం‌ఐ నోట్‌బుక్ 14 హారిజోన్ ఎడిషన్ యానోడైజ్డ్ సాండ్ బ్లాస్టెడ్ ఫినిష్ తో వస్తున్నాయి. అయితే ఇందులో ఇంటర్నల్ వెబ్‌క్యామ్‌ను ఉండదు.

ఎం‌ఐ నోట్‌బుక్  14, ఎం‌ఐ నోట్‌బుక్  14 హారిజన్ ఎడిషన్ ధర 
ఎం‌ఐ నోట్‌బుక్  14 మూడు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్  దీని ధర రూ. 41,999 ఉండగా, 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 44.999. 512జి‌బి మోడల్ ఎన్విడియా జిఫోర్స్ ఎం‌ఎక్స్ 250 జి‌పి‌యూతో కూడా లభిస్తుంది దీని ధర రూ. 47.999. ఇది సింగిల్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే వస్తుంది. 

also read జొమాటోకి రికార్డు స్థాయిలో పెరిగిన ఆదాయం.. ...

ఎం‌ఐ నోట్‌బుక్  14 హారిజోన్ ఎడిషన్ రెండు కాన్ఫిగరేషన్లలో వస్తుంది, ఒకటి 10 వ జెనరేషన్ కోర్ ఐ5 ప్రాసెసర్ రెగ్యులర్ ఎస్ఎస్‌డితో, మరొకటి 10 వ జెనరేషన్ కోర్ ఐ7 ప్రాసెసర్ తో స్పీడ్ ఎన్‌వి‌ఎం‌ఎస్‌డితో వస్తుంది. కోర్ ఐ5 మోడల్ ధర రూ. 54,999 కాగా, కోర్ ఐ7 మోడల్ ధర రూ. 59.999. రెండు ల్యాప్‌టాప్‌లు అమెజాన్, ఎం‌ఐ.కామ్ ద్వారా అందుబాటులో ఉంది. అంతేకాకుండా  ఎం‌ఐ  హోమ్ స్టోర్స్‌ ద్వారా కూడా లభిస్తాయి. అయితే రెండు ల్యాప్‌టాప్‌లపై కొన్ని ఆఫర్‌లను కూడా అందిస్తుంది. మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులతో అయితే  రూ.2,000 క్యాష్‌బ్యాక్, సులభమైన ఇఎంఐ, బిఎఫ్‌ఎల్ ఇఎంఐ నెట్‌వర్క్ కార్డుతో జీరో ఇఎంఐ , మూడు నెలల నుండి తొమ్మిది నెలల వరకు సెలెక్ట్ చేసిన కార్డులపై జీరో ఇఎంఐ అందిస్తుంది.

ఎం‌ఐ నోట్‌బుక్  14 ఫీచర్లు 
 విండోస్ 10 హోమ్‌లో నడుస్తుంది, 14-అంగుళాల పూర్తి-హెచ్‌డి (1,920x1,080 పిక్సెల్స్) డిస్ ప్లే, 10 వ జనరేషన ఇంటెల్ కోర్ ఐ5-10210 యు ప్రాసెసర్‌తో పాటు ఎన్విడియా జిఫోర్స్ ఎంఎక్స్ 250 గ్రాఫిక్స్, 8జిబి డిడిఆర్4 ర్యామ్ 2,666 మెగాహెర్ట్జ్ క్లాక్, 512GB వరకు సాట ఎస్‌ఎస్‌డి స్టోరేజ్ తో వస్తుంది. ఎం‌ఐ నోట్‌బుక్ 14లో 46Wh బ్యాటరీ, ఒకే ఛార్జీపై 10 గంటల బ్యాక్ అప్ అందిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ లో  వై-ఫై, బ్లూటూత్ వి5.0, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, రెండు యుఎస్‌బి 3.1 పోర్ట్‌లు, యుఎస్‌బి 2.0 పోర్ట్, హెచ్‌డిఎంఐ పోర్ట్, డేటా ట్రాన్స్ఫర్, ఛార్జింగ్ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఆడియోను డి‌టి‌ఎస్ ఆడియో ప్రాసెసింగ్‌తో రెండు 2W స్పీకర్లు ఉనాయి. దీని బరువు 1.5 కిలోలు.

ఎం‌ఐ నోట్‌బుక్ 14 హారిజోన్ ఎడిషన్ ఫీచర్లు
ఎం‌ఐ నోట్‌బుక్ 14 హారిజోన్ ఎడిషన్ విండోస్ 10 హోమ్ పై నడుస్తుంది, 14-అంగుళాల పూర్తి-హెచ్‌డి (1,920x1,080 పిక్సెల్స్) యాంటీ-గ్లేర్ ఐపిఎస్ డిస్‌ప్లే, 91 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో, 10వ జెనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7-10510 యు ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఎన్విడియా జిఫోర్స్ ఎంఎక్స్ 350 జిపియు, 8జిబి డిడిఆర్4 ర్యామ్ 2,666 మెగాహెర్ట్జ్, 512జి‌బి ఎస్‌ఎస్‌డి స్టోరేజ్.

click me!