ఎంఐ అవుట్ డోర్ బ్లూటూత్ స్పీకర్‌లో ప్లే / పాజ్, పవర్ బటన్ ఇంకా ఒక వైపు మైక్రోఫోన్, ఛార్జింగ్ పోర్ట్, మరోవైపు ఆక్స్ పోర్ట్ ఉన్నాయి.
చైనా దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమి ఇండియాలో ఎంఐ అవుట్ డోర్ బ్లూటూత్ స్పీకర్‌ను లాంచ్ చేసింది. ఇది ఎంఐ.కామ్ లో అమ్మకానికి అందుబాటులో ఉంది. షియోమి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఈ ప్రకటన చేశారు.
ఇది 5W సౌండ్, 20 గంటల పాటు బ్యాటరీ బ్యాక్ అప్ ఇస్తుంది. ప్రత్యేకత ఏంటంటే ఇది వాయిస్ అసిస్టెంట్లకు సపోర్ట్ చేస్తుంది. ఎంఐ అవుట్ డోర్ బ్లూటూత్ స్పీకర్ ప్రస్తుత ధర రూ. 1,399. అయితే దీని అసలు ఎంఆర్‌పి ధర రూ.1,999, 30 శాతం తగ్గింపు ధరతో అందిస్తుంది. అధికారిక వెబ్‌సైట్‌లో ఒకే కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంది, అది కూడా బ్లాక్ కలర్ మాత్రమే.
undefined
also read సౌండ్‌కోర్ నుండి "ఐకాన్ మినీ" బ్లూటూత్ స్పీకర్ లాంచ్...
ఎంఐ అవుట్ డోర్ బ్లూటూత్ స్పీకర్ చాలా తేలికగా, చిన్న సైజులో ఉంటుంది. దీనిని ఎక్కడైనా తీసుకెళ్లడం చాలా సులభం. ఇది ఆండ్రయిడ్ మరియు ఐఓఎస్ డివైజులకు సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.0 ద్వారా కనెక్ట్ అవుతుంది. స్పీకర్‌లో ఉన్న 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ మీకు 20 గంటల పాటు మ్యూజిక్ ప్లేబ్యాక్ ఇస్తుందని షియోమి తెలిపింది. ఛార్జింగ్ కోసం ఆక్స్ పోర్ట్ అలాగే మైక్రో-యూఎస్‌బి పోర్ట్ కూడా ఉంది.
మేము చెప్పినట్లుగా ఎంఐ అవుట్ డోర్ బ్లూటూత్ స్పీకర్ ఇప్పటికే సేల్స్ కోసం ఎంఐ.కామ్ లో ఉంది. దీనికి ఐపిఎక్స్ 5 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. అంటే దానిపై వాటర్ పడ్డ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎంఐ అవుట్ డోర్ బ్లూటూత్ స్పీకర్ క్యారీ స్ట్రింగ్ తో వస్తుంది.
also read 10వేల కోట్లు చెల్లించిన భారతి ఎయిర్‌టెల్...
స్పీకర్ ఒక వైపు పవర్ బటన్, ప్లే / పాజ్ బటన్ ఉన్నాయి. మీకు ఇష్టమైన వాయిస్ అసిస్టెంట్‌లో దేనినైనా మీరు ఉపయోగించవచ్చు. ఇది ఫోన్ కాల్స్ మాట్లుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. దీనిలో మైక్రోఫోన్ కూడా కలిగి ఉంది.
డయాఫ్రాగమ్ కెనడియన్ లాంగ్ ఫైబర్ పల్ప్ వైబ్రేషన్ ఫిల్మ్ నుండి తయారైందని మార్కెటింగ్ మెటీరియల్ తెలిపింది. ఇది డంపింగ్ సిస్టమ్‌తో పాటు మరింత సహజమైన, స్పష్టమైన సౌండ్ ఇస్తుంది. ఎంఐ అవుట్ డోర్ బ్లూటూత్ స్పీకర్‌పై పాసివ్ రేడియేటర్ ఉంది, ఇది బ్యాటరీ తక్కువ ఉన్నపుడు లో-బ్యాటరీ అని సిగ్నల్ కూడా చెప్తుంది.