108 ఎంపి కెమెరాతో ఇండియన్ మార్కెట్లోకి షియోమీ కొత్త బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్..

By S Ashok Kumar  |  First Published Jan 9, 2021, 10:39 AM IST

మొదట ఈ సెల్ అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం అందుబాటులోకి తెచ్చింది. తరువాత నాన్-ప్రైమ్ సభ్యుల కోసం జనవరి 8, శుక్రవారం నుండి అమెజాన్, ఎం‌ఐ.కామ్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా సేల్ ప్రారంభించింది. 


భారతదేశంలో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ కొత్త 5జి ఫోన్ ఎం‌ఐ 10ఐ ధర, స్పెసిఫికేషన్లను ఈ వారం ప్రారంభంలో ప్రకటించింది. మొదట ఈ సెల్ అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం అందుబాటులోకి తెచ్చింది.

తరువాత నాన్-ప్రైమ్ సభ్యుల కోసం జనవరి 8, శుక్రవారం నుండి అమెజాన్, ఎం‌ఐ.కామ్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా సేల్ ప్రారంభించింది. ఎం‌ఐ 10ఐ స్పెసిఫికేషన్లలో స్నాప్‌డ్రాగన్ 750జి చిప్‌సెట్, 108 ఎంపి కెమెరా, 120 హెర్ట్జ్ డిస్‌ప్లే, 33 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ముఖ్యమైన ఫీచర్స్  ఉన్నాయి, దీని ధర విభాగంలో ఫీచర్-రిచ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది.

Latest Videos

undefined

భారతదేశంలో ఎం‌ఐ10ఐ ధర
భారతదేశంలో ఎం‌ఐ10ఐ ధర 6 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో బేస్ వేరియంట్‌కు రూ.20,999 వద్ద ప్రారంభమవుతుంది. అయితే, ఈ వేరియంట్ ప్రస్తుతం అందుబాటులో లేదు, ఎప్పుడు విక్రయించబడుతుందనే దానిపై ఎటువంటి సమాచారం లేదు.

also read 

6జిబి  + 128జిబి ధర రూ.21,999, 8జిబి  + 128జిబి వేరియంట్ ధర రూ. 23,999తో  కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఎం‌ఐ10ఐ పసిఫిక్ సన్‌రైజ్, అట్లాంటిక్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

ఎం‌ఐ10ఐ ఫీచర్స్ 
ఎం‌ఐ10ఐలో 6.67-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + అడాప్టివ్‌సింక్ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డిస్‌ప్లే 450 నిట్స్ బ్రైట్ లెవెల్, హెచ్‌డిఆర్ 10 + వరకు సపోర్ట్ ఇస్తుంది, గొరిల్లా గ్లాస్ 5  ప్రొటెక్షన్,  ఎం‌ఐ10 ఐ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 750జి చిప్‌సెట్ ద్వారా 8 జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌ అందించారు.  

108ఎం‌పి శామ్‌సంగ్ హెచ్‌ఎం 2 సెన్సార్, 8 ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపి మాక్రో లెన్స్, 2 ఎంపి డెప్త్ సెన్సార్‌తో కూడిన క్వాడ్-కెమెరా సిస్టమ్‌ను ఎం‌ఐ 10 ఐ స్పెక్స్ హైలైట్ చేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌కు 16 ఎంపి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4,820 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఎం‌ఐ10ఐలో స్టీరియో స్పీకర్లు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఐఆర్ బ్లాస్టర్, 5జి సపోర్ట్ తో మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి.

click me!