చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ మార్చి 27న తన ఎంఐ 10 సిరీస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రపంచంలోనే మొదటిసారిగా 108 ఎంపీ పెంటా కెమెరాను తీసుకొస్తోంది.
న్యూఢిల్లీ: చైనా ఎలక్ట్రానిక్స్ మేజర్ షియోమీ తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్లు ఎంఐ 10, ఎంఐ 10 ప్రో మోడల్ ఫోన్లను ఈ నెల 27వ తేదీన విడుదల చేయనుంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఎంఐ 10 సిరీస్ ఈవెంట్‌ను ఆన్లైన్లో మాత్రమే ఆవిష్కరించాలని షియోమీ నిర్ణయించింది.
వరల్డ్ మొబైల్ కాంగ్రెస్‌కు ముందు మార్చి 23న విడుదల చేయాలని తొలుత షియోమీ భావించింది. ఆ కార్యక్రమం రద్దయిన నేపథ్యంలో విడుదల తేదీని మార్చి 27కి మార్చింది. షియోమీ ప్రపంచంలోనే తొలిసారిగా 108 ఎంపీ పెంటా కెమెరాను తీసుకొస్తోంది.
also read కరోనా వైరస్ రాకుండా...'కోవా పంజాబ్' మొబైల్ యాప్...
ఎంఐ10, ఎంఐ 10 ప్రో ఫోన్లలో పంచ్ హోల్ కట్ అవుట్ లోపల ఈ కెమెరా ఉంటుంది. అయితే దీనిలో వాడిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 865 ఎస్ఓసీ ప్రాసెసర్‌ను గత నెల 11వ తేదీన విపణిలోకి ప్రవేశించిన శామ్‌సంగ్ గెలక్సీ ఎస్ 20 సిరీస్‌లోనూ వాడారు.
ఎంఐ 10 మోడల్ ఫోన్ 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతోపాటు ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 865 ఎస్ఓసీ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ను 12 జీబీ ర్యామ్ విత్ 256జీబీ ఇంటర్నెల్ స్టోరేజీ సామర్థ్యంతో రూపొందించారు.
ఎంఐ 10 ఫోన్ 5జీ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఎంఐ10 మోడల్ ఫోన్‌లో 4500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉండగా, దానికి 40 వాట్ వైర్డ్ +30 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌గా నిలుస్తుంది.
also read ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్... వాటికికోసం ఫ్రీ రిపేర్ సర్వీస్ ప్రోగ్రామ్...
ఎంఐ 10 మోడల్ ఫోన్‌లో 108 ఎంపీ ప్రైమరీ రియర్ క్వాడ్ కెమెరాతోపాటు 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ సామర్థ్యం గల 48 ఎంపీ టెలిఫొటో కెమెరా ఉన్నాయి. ఇంకా 12 ఎంపీ ఆల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్, 8 ఎంపీ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి.
ఎంఐ 10 ఫోన్ ప్రారంభ ధర రూ.41,090 ఉండొచ్చునని భావిస్తున్నారు. దీంతోపాటు ఎంఐ 10 ప్రో మోడల్ ఫోన్‌లో 5250 ఎంఎహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది. దీనికి 66 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. దీని ధర రూ.51,190 ఉంటుందని తెలుస్తోంది.