వినియోగదారుల మనసు దోచేస్తున్న ఒప్పో రెనో3 ప్రో

By Sandra Ashok Kumar  |  First Published Mar 9, 2020, 4:23 PM IST

ఒప్పో కంపెనీ తాజాగా మరో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చింది.ఒప్పో రెనో3 ప్రో స్మార్ట్ ఫోన్ ని తాజాగా విడుదల చేసింది. అద్భుతమైన ఫీచర్లతో తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది.


ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగించని వారి సంఖ్య చాలా అరుదుగా ఉంటుంది. కాగా... వినియోగదారులు సైతం అన్నింటిలోకెల్లా ఉత్తమమైనది కొనుగోలు చేయాలని చూస్తుంటారు. అలాంటి అత్యుత్తమ స్మార్ట్ ఫోన్లు అందించే కంపెనీల్లో ఒప్పో ముందు వరసలో ఉంటుంది.

కాగా.. తాజాగా తన ట్రాక్ రికార్డును మరోసారి కొనసాగిస్తూ.. ఒప్పో కంపెనీ తాజాగా మరో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చింది.ఒప్పో రెనో3 ప్రో స్మార్ట్ ఫోన్ ని తాజాగా విడుదల చేసింది. అద్భుతమైన ఫీచర్లతో తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది.

Latest Videos

 


ఒప్పో రెనో3ప్రో ఫీచర్లు..

OPPO రెనో 3 ప్రోలో సూపర్ AMOLED డిస్ప్లే ఉంది, స్క్రీన్ రెసల్యూషన్ 20: 9 తో పాటు 158.8mm × 73.4mm × 8.1mm పరిమాణం కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల మీ కంటికి ఎలాంటి హానీ జరగదని ఒప్పో హామీ ఇస్తుంది.

అందుకోసం ప్రత్యేకంగా ఈ ఫోన్ లో TÜV రీన్లాండ్  అనే సాఫ్ట్ వేర్ ని పొందరుపరిచారు. ఇది ఎక్కువ సేపు ఫోన్ చూసినా ఎలాంటి హానీ జరగకుండా కాపాడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ మూడు రంగుల్లో అందుబాటులోకి వస్తోంది. అరోరల్ బ్లూ, మిడ్ నైట్ బ్లాక్, స్కై వైట్ రంగుల్లో రెనో3 ప్రో స్మార్ట్ ఫోన్ లభ్యమౌతుంది.


రాత్రి సమయాల్లోనూ అదిరిపోయే ఫోటోలు..

ఒప్పో స్మార్ట్ ఫోన్.. ఫోటోలకు ప్రత్యేకమైన విషయం తెలిసిందే. కాగా... ఆ విషయంలో ఈ స్మార్ట్ ఫోన్ లో మరిన్ని అదనపు ఫీచర్లు జత చేశారు. ఎక్కువగా సెల్ఫీలు, ఫోటోలు తీసేవారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్.

ఎలాంటి కాంతిలోనైనా అద్భుతమైన ఫోటోలు తీయగలరు. సాధారణంగా పగలు తీసే ఫోటోలు వచ్చినంత అద్భుతంగా రాత్రివేళ తీస్తే రావు. అయితే.. ఈ ఫోన్లో మాత్రం అలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు.

దీనిలో 64మెగాపిక్సెల్ జూమ్ క్వాడకామ్ అంతేకాకుండా ప్రపంచంలో తొలిసారిగా 44 + 2MP డ్యూయల్ పంచ్-హోల్ కెమెరా ఏర్పాటు చేశారు. కెమెరా అల్ట్రా క్లియర్ 108 ఎంపి ఇమేజ్‌తో జత చేశారు. ఇది  ఫోటోల నాణ్యతను పెంచుతుంది.

ఫ్రంట్ కెమెరాలో అల్ట్రా నైట్ సెల్ఫీ మోడ్ మొదటిసారి ప్రవేశపెట్టారు. ఇది రాత్రి సమయంలో సెల్ఫీలు ప్రకాశవంతంగా మరియు స్పష్టంగా వచ్చేలా సహాయం చేస్తుంది. దీనికోసం ప్రత్యేక అల్గారిథమ్ ని పొందుపరిచారు.

దీంతో బ్యాక్  కెమెరాలోని అల్ట్రా డార్క్ మోడ్ ఆప్షన్ అద్భుతంగా పనిచేస్తుంది. మనం కంటితో కూడా సరిగా చూడలేని వాటిని ఈ కెమేరాతో బంధించవచ్చు.

ఫ్రంట్ కెమెరా    

 

అద్భుతమైన వీడియోలు..

OPPO రెనో 3 ప్రో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మరియు అల్ట్రా-వైడ్ యాంగిల్ ఉపయోగించి  అద్భుతమైన సెల్ఫీలు, స్థిరమైన మరియు మరింత డైనమిక్ వీడియోలు తీసుకునే అవకాశం ఉంది.

ఇందుకోసం డ్యూయల్ లెన్స్ బోకె ఆప్షన్ అందిస్తోంది.  మొట్టమొదటిసారిగా, OPPO వీడియోల కోసం బోకె, 5x హైబ్రిడ్ జూమ్ మరియు 20x డిజిటల్ జూమ్‌తో పాటు వీడియోలలో ఏఐ బ్యూటీ మూడ్‌ను కూడా ప్రవేశపెట్టింది.

#OPPOReno3Pro

ఈ ఫీచర్లు ఫోన్‌లో వీడియో షూట్‌ల నాణ్యతను పెంచుతాయి. దీంతో అద్భుతమైన క్లారిటీతో వీడియోలు తీసుకునే అవకాశం ఉంది.  అంతే కాకుండా తీసిన వీడియోలను ఎడిట్ చేసుకునే అవకాశం కూడా అందిస్తోంది.

కేవలం ఒక్క క్లిక్ తో మనకు నచ్చినట్లు వీడియోని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. అలా ఎడిట్ చేసుకున్న వీడియో మరో క్లిక్ తో సోషల్ మీడియాలో షేర్ చేసుకునే సదుపాయం ఉంది.

బ్యాక్ కెమెరా   


హై ట్రాన్స్ఫర్మేషన్, గ్రేట్ మెమరీ...

ఫోన్ పనితీరు 8GB RAM + 128GB / 256GB మెమరీతో సమానంగా ఉంటుంది. హైపర్ బూస్ట్ ఫీచర్ మెరుగైన గేమింగ్ పనితీరును అనుమతిస్తుంది. OPPO రెనో 3 ప్రో తొలిసారిగా  విజువల్ ఆప్టిమైజేషన్ ,నెట్‌ఫ్లిక్స్, డాల్బీ అట్మోస్ హాయ్-రెస్ ఆడియోలలో 1080P స్ట్రీమింగ్‌ను అందిస్తున్నారు.

ఆపరేటింగ్ సిస్టమ్  కలర్‌ఓఎస్ 7 ని పొందుపరిచారు. మెరుగైన గ్రాఫిక్స్, డార్క్ మోడ్ వంటి అదనపు ఫీచర్లను అందిస్తున్నారు. బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. 4025mAh బ్యాటరీ, 30W VOOC ఫ్లాష్ ఛార్జ్ 4.0 ని ఏర్పాటు చేశారు.  ఇది తక్కువ ఛార్జింగ్ తో ఎక్కువ సేపు ఫోన్ వినియోగించుకునే అవకాశం కల్పిస్తుంది.

#DualPunchHole

ఇన్ని అద్భుతమైన ఫీచర్లను కలిగిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర ఎంతో తెలుసా..?

OPPO Reno3 Pro: 8+128GB – Rs. 29,990
OPPO Reno3 Pro: 8+256GB – Rs. 32,990

ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్ లో ఈఎంఐ సదుపాయం కల్పిస్తున్నారు. ఇక జియో వినియోగదారులకు 100శాతం మొబైల్ డేటా అదనంగా అందించనున్నారు. ఆఫ్ లైన్ లో కొనుగోలు చేసిన వినియోగదారులకు స్మార్ట్ ఫోన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ సదుపాయం కూడా ఉంది.

 

click me!