షియోమి భారతదేశంలో ట్రు వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ల విభాగంలో మొదటి ఉత్పత్తి ఇది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పరిమితులను సడలించిన తరువాత షియోమి వీటిని లాంచ్ చేసింది. కంపెనీ ఇటీవలి ఆన్‌లైన్ ఈవెంట్‌లో ఎంఐ బాక్స్ 4కె స్ట్రీమింగ్ డివైజ్, ఎంఐ 10 స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 ను విడుదల చేశారు.
స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి ఎంఐ ఇప్పుడు ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 భారతదేశంలో లాంచ్ చేశారు. షియోమి భారతదేశంలో ట్రు వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ల విభాగంలో మొదటి ఉత్పత్తి ఇది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పరిమితులను సడలించిన తరువాత షియోమి వీటిని లాంచ్ చేసింది. కంపెనీ ఇటీవలి ఆన్‌లైన్ ఈవెంట్‌లో ఎంఐ బాక్స్ 4కె స్ట్రీమింగ్ డివైజ్, ఎంఐ 10 స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 ను విడుదల చేశారు.
ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ 2 ధర రూ. 4,499, అయితే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద కంపెనీ ఇయర్‌ఫోన్‌లను రూ. 3,999అందిస్తుంది. ఈ పరిమిత కాల ప్రమోషన్ ఆఫర్ మే 12 నుండి 17 వరకు ఉంటుంది. అయితే ఇవి మే 12 నుండి మధ్యాహ్నం 12 గంటలకు సేల్స్ ప్రారంభమవుతాయి.
undefined
ఇయర్‌బడ్‌లు అమెజాన్, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్ స్టోర్స్ ద్వారా లభిస్తాయి. ఇవి త్వరలో ఎంఐ భాగస్వామి స్టోర్లలో లభించనుంది.ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 ను ఈ ఏడాది మార్చిలో 80 యూరోలకు (సుమారు రూ .6,600) లాంచ్ చేశారు.
అయితే షియోమి ఈ విభాగంలో రియల్ మీతో పోటీ పడుతున్నట్లు కనిపిస్తున్నందున, భారతదేశం దీని ధర గణనీయంగా తగ్గింది. రియల్ మీ బడ్స్ ఎయిర్ ధర రూ. 3,999, ఇక షియోమి ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 ధరను భారతదేశంలో తన ప్రత్యర్థికి పోటీగా వీటిని తీసుకువచ్చింది.
also read గుడ్ న్యూస్: త్వరలో ఫేస్‌బుక్ నుంచి ఫ్రీ ఇంటర్నెట్...
ఇయర్‌ఫోన్‌లు చెవికి ఫిట్ అయ్యేలా ఎయిర్‌పాడ్స్ లాంటి ఇయర్‌పీస్ డిజైన్ తో 14.2 ఎంఎం డ్రైవర్లు కూడా ఉన్నాయి. ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 బ్లూటూత్ 5.0 కు సపోర్ట్ చేస్తుంది.
ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 ఇయర్‌ఫోన్‌లలో 30 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఛార్జింగ్ కేసులో అదనంగా 250 ఎంఏహెచ్ బ్యాటరీని ఉంటుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్లేబ్యాక్, వాయిస్ అసిస్టెంట్‌ను యాక్సెస్ చేయడానికి ఇయర్‌ఫోన్‌లకు టచ్ సెన్సిటివ్ కంట్రోల్స్ ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్, అలెక్సా, సిరి వాటికి సపోర్ట్ చేస్తుంది.
భారతదేశంలో షియోమి ఎంఐ బాక్స్ 4కె స్ట్రీమింగ్ డివైజ్ ని రూ.3,499 అందిస్తుంది. కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించడానికి మార్చిలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన తరువాత షియోమి చేసిన మొదటి అతిపెద్ద ప్రయోగం ఇది.