షియోమి ఎం‌ఐ నుండి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్...

By Sandra Ashok Kumar  |  First Published Feb 20, 2020, 5:36 PM IST

ఎం‌ఐ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ టి300 మీ వ్యక్తిగత దంతవైద్యుడులాగా ఉంటుందని షియోమి తెలిపింది. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 25 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. యూ‌ఎస్‌బి-సి పోర్ట్ ద్వారా ఛార్జింగ్ చేయవచ్చు.


మీరు షియోమి పేరు వినగానే మీకు గుర్తుకు వచ్చేవి ఆండ్రయిడ్ ఫోన్లు లేదా టెలివిజన్లు, 4 కె టీవీలు గుర్తొస్తాయి. కానీ దంత సంరక్షణ గురించి అయితే మీరు ఆలోచించరు. కానీ ఇప్పుడు ఇది మరాబోతుంది.

చైనా దిగ్గజ కంపెనీ షియోమి బ్రాండ్ ఇప్పుడు ఎం‌ఐ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ టి300ను భారతదేశంలో లాంచ్ చేసింది. వాస్తవానికి ఇది ఎం‌ఐ.కాంలో క్రౌడ్ ఫండింగ్ కోసం 1,299 రూపాయల ధరకి అందిస్తున్నారు.

Latest Videos

also read టచ్ సెన్సార్‌తో హైఫ్యూచర్ ఫ్లైబడ్స్ ఇయర్ ఫోన్స్ లాంచ్

ఎం‌ఐ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ టి300 మీ వ్యక్తిగత దంతవైద్యుడులాగా ఉంటుందని షియోమి తెలిపింది. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 25 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. యూ‌ఎస్‌బి-సి పోర్ట్ ద్వారా ఛార్జింగ్ చేయవచ్చు. ఇది ఐపిఎక్స్ 7 వాటర్ ప్రూఫ్ రెసిస్టంట్ కలిగి ఉంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అని షియోమి తెలిపింది. 

పళ్ళు తోముకోవడం తరచుగా మన దినచర్యలో ఒక భాగం. ఆరోగ్య సంరక్షణకు ఓరల్ హెల్త్‌కేర్ అనేది చాలా ముఖ్యం. ఎం‌ఐ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ తో వినియోగదారులు బ్రష్ చేసుకునే ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకోవాలని మేము భావిస్తున్నాము. 

also read ఇండియాలోకి కొత్త బ్రాండ్ స్మార్ట్ ఫోన్....వివరాలు లీక్.....

ఎం‌ఐ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ టి300లో రెండు బ్రషింగ్ మోడ్లు ఉన్నాయి. అవి జెంటిల్ మోడ్, స్టాండర్డ్ మోడ్ ఉన్నాయి. ఈక్విక్లీన్ ఆటో-టైమర్ కూడా ఉంది. ఇది ప్రతి 30 సెకన్లకు ఒకసారి బ్రషింగ్ మరో వైపుకు మార్చమని వినియోగదారులకు గుర్తు చేస్తుంది.

మాగ్నెటిక్ లెవిటేషన్ సోనిక్ మోటారు దంతాలపై ఉన్న బ్యాక్టీరియాని తొలగిస్తుంది.ఇది నిమిషానికి 31000 వైబ్రేషన్లను ఉత్పత్తి చేస్తుంది. టైనెక్స్ స్టాక్లీన్ యాంటీ మైక్రోబయల్ బ్రిస్టల్స్ 10-డిగ్రీల కోణంలో ఉండి సమర్థవంతంగా రెండు వైపులా దంతాలను శుభ్రపరచడానికి  సహకరిస్తుంది.
 

click me!