ఐక్యూ3 స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 865 ఎస్‌ఓసి చేత పవర్ చేస్తుంది. ఐక్యూ ఇండియా డైరెక్టర్ గగన్ అరోరా దీనిని ధృవీకరించారు.
ఐక్యూ కంపెనీ ఒక కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. ఐక్యూ 3 అనే పేరుతో ఒక కొత్త స్మార్ట్ పోన్ ఫిబ్రవరి 25న భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ వివరాలను టీజర్ల ద్వారా కంపెనీ ఇప్పటికే విడుదల చేసింది.
ఈ స్మార్ట్ ఫోన్ 48 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుందని టిజర్ ద్వారా తెలిపింది. ఇందులో ఏఐ ఐ ట్రాకింగ్ టెక్నాలజీని కూడా ఇందులో అనుసంధానిస్తుంది.
undefined
also read ఇక్యూ టెక్నాలజీతో లెనోవో కొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్....
ఇప్పుడు తాజా లీక్ అయిన ఐక్యూ 3 ధర, ఫీచర్స్, డిజైన్ వివరాలను సూచిస్తున్నాయి. ఐక్యూ ఇండియా డైరెక్టర్ గగన్ అరోరా కూడా ఈ ఫోన్‌ను స్నాప్‌డ్రాగన్ 865 ఎస్‌ఓసి చేత పవర్ చేస్తుంది అని ప్రత్యేకంగా ధృవీకరించారు.
ఐక్యూ 3 స్మార్ట్ ఫోన్ 4జి, 5జి మోడల్స్ రెండూ కూడా విడుదల కానున్నాయని ఆయన పేర్కొన్నారు. గేమింగ్, అల్ట్రా గేమ్ మోడ్, కొత్త 180 హెర్ట్జ్ టచ్ రెస్పాన్స్ రేట్ కోసం కంపెనీ సైడ్ ప్యానెల్‌లో ‘మొంస్టర్ టచ్ బటన్లను’ టీజ్ చేస్తోంది.
తాజా నివేదిక ప్రకారం ఐక్యూ 3 స్మార్ట్ ఫోన్ ధర భారతదేశంలో రూ. 45,000 తక్కువ ఉంటుందని తెలుస్తోంది. 4జీ వేరియంట్ ధర సుమారు రూ. 35,000 కాగా, 5జీ మోడల్ ధర సుమారు రూ. 40,000. ఫ్లిప్‌కార్ట్ కాకుండా ఫోన్‌ను ఆఫ్‌లైన్‌లోకి కూడా అందుబాటులోకి తెస్తామని అందులో పేర్కొంది.
also read ఏప్రిల్ 3న ఆపిల్ కొత్త ఐఫోన్ లాంచ్..?
ఇంకా ఐక్యూ 3 స్మార్ట్ ఫోన్ ఫోటోలు ఒక వెబ్ సైట్ లో కనిపించాయి. ఈ ఫోటోలు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో తీసినట్లు అనిపిస్తుంది. ఫోన్ ఆరెంజ్, బ్లాక్, క్వాంటం సిల్వర్ కలర్ ఆప్షన్లలో లాంచ్ అవుతుందని కూడా చూడవచ్చు.
క్వాడ్ కెమెరాలు వెనుక భాగంలో ఉంటాయి. స్క్రీన్ పై భాగంలో సెల్ఫీ కెమెరా కటౌట్‌తో ముందు హోల్-పంచ్ డిస్ లే కలిగి ఉంది. ఐక్యూ 3 స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఫోటోలలో కూడా చూడవచ్చు. సూపర్ అమోలేడ్ ప్యానెల్‌తో ‘పోలార్ వ్యూ డిస్ ప్లే’ ఉంటుంది.
ఇది ఎల్‌పిడిడిఆర్5 ర్యామ్, యూఎఫ్‌ఎస్ 3.1 స్టోరేజ్ ఉంటుదని సూచిస్తుంది. 55W సూపర్ ఫ్లాష్ ఛార్జ్‌తో 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ, హై-ఫై ఎకె 4377ఎ పిఎ యాంప్లిఫైయర్ కూడా దీనిలో ఉండబోతున్నాయి. ఫిబ్రవరి 25న ఐక్యూ 3 లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్‌ను లాంచ్ చేయడానికి కంపెనీ చైనాతో పాటు భారతదేశంలో కార్యక్రమాలను నిర్వహిస్తోంది.