టచ్ సెన్సార్‌తో హైఫ్యూచర్ ఫ్లైబడ్స్ ఇయర్ ఫోన్స్ లాంచ్

By Sandra Ashok Kumar  |  First Published Feb 20, 2020, 4:32 PM IST

హైఫ్యూచర్ ఫ్లైబడ్స్ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు నాలుగు కలర్ వేరియంట్‌లలో లభిస్తాయి. వీటిలో మాట్టే బ్లాక్, మింట్ గ్రీన్, ఫ్లెమింగో పింక్, పెర్ల్ వైట్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియాలో ఇయర్‌బడ్స్‌ కొనుగోలు చెయ్యొచ్చు.
 


చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ హైఫ్యూచర్ ఒక కొత్త  వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.హైఫ్యూచర్ ఫ్లైబడ్స్ అని పిలువబడే ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌ల ఫీచర్స్, ధర గురించి వివరాలను వెల్లడించింది.

లేటెస్ట్ ఆఫర్‌తో బడ్జెట్ ధరకే ఇయర్‌బడ్స్ అందించాలని యోచిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.కంపెనీ చెప్పినట్లు ఇయర్‌బడ్స్‌  ధరను రూ.2,499 గా నిర్ణయించింది.ఫ్లైబడ్స్ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు నాలుగు కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.

Latest Videos

undefined

also read ఇండియాలోకి కొత్త బ్రాండ్ స్మార్ట్ ఫోన్....వివరాలు లీక్.....

వీటిలో మాట్టే బ్లాక్, మింట్ గ్రీన్, ఫ్లెమింగో పింక్, పెర్ల్ వైట్ ఉన్నాయి.  ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియాలో మాత్రమే ఈ ఇయర్‌బడ్స్‌ అందుబాటులో ఉన్నాయి.హైఫ్యూచర్ ఫ్లైబడ్స్  వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫీచర్స్ వచ్చేసి మెరుగైన కనెక్టివిటీ కోసం కంపెనీ ఫ్లైబడ్స్‌లో సరికొత్త బ్లూటూత్ వి 5.0 ఇందులో ఉంది.

అదనంగా ఇయర్‌బడ్‌లు అధిక నాణ్యత గల ప్లేబ్యాక్ కోసం డైనమిక్ ఎన్42 నియోడైమియం మాగ్నెట్ డ్రైవర్లను ఉపయోగిస్తాయి. క్వాలిటి సౌండ్ అందించడానికి  కంపెనీ  ఇందులో గ్రాఫేన్ డ్రైవర్లను ఉపయోగించింది.ఇది "అల్ట్రా-రియలిస్టిక్ లిజనింగ్ ఎక్స్‌పీరియన్స్" తో "అసాధారణమైన సౌండ్ ని" నిర్ధారిస్తుందని హైఫ్యూచర్ పేర్కొంది.

ఈ ఇయర్‌ఫోన్స్ రెండింటి బరువు 5 గ్రాములు. ఛార్జింగ్ కేసు బరువుతో కలిపి ఇది 45 గ్రాములు ఉంటుంది.ఛార్జింగ్ కేసు పై ఛార్జింగ్ లెవెల్ చూపించడానికి 3 ఎల్‌ఈ‌డి లైట్స్ ఉంటాయి.ఫ్లైబడ్స్ వాటర్, డస్ట్ ప్రూఫ్ ఐపిఎస్ఎక్స్ 5 ధృవీకరణ కూడా పొందింది.  

also read ఇక్యూ టెక్నాలజీతో లెనోవో కొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్....


బ్యాటరీ బ్యాకప్‌ విషయంలో హైఫ్యూచర్ ఫ్లైబడ్స్ ట్రు వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు నాలుగు గంటల ఆడియో ప్లేబ్యాక్‌ బ్యాకప్ అందిస్తాయి.దీనికి మించి వినియోగదారులు మరో 15 గంటల బ్యాటరీ బ్యాకప్ కేసు ద్వారా చార్జ్ చేసుకోవడానికి ఉపయోగించవచ్చు.

అంటే వినియోగదారులు 19 గంటల వరకు మ్యూజిక్ వినగలరు. దీనికి మించి ఇయర్‌బడ్స్‌  హైలైట్ ఇంటెలిజెంట్ టచ్ సెన్సార్ కంట్రోల్స్. ఈ టచ్ కంట్రోల్స్  వినియోగదారులను మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను కంట్రోల్ చేసుకోడానికి, కాల్స్ మాట్లాడడానికి కావడానికి, గూగుల్ అసిస్టెంట్‌ను వాడటానికి సపోర్ట్ చేస్తాయి.
 

click me!