ఎంఐ రోబోట్ వాక్యూమ్ మోప్-పి ప్రస్తుతం క్రౌడ్ ఫండింగ్ ప్రచారంలో భాగంగా అందుబాటులో ఉంది, వీటి ఎగుమతులు సెప్టెంబర్ 15 నుండి ప్రారంభమవుతాయి.
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమి ఎంఐ రోబోట్ వాక్యూమ్-మోప్ పి పేరుతో రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్‌ను భారతదేశంలో విడుదల చేసింది. తాజా ఉత్పత్తి చైనాలో ఎంఐ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ వేరియంట్‌గా వస్తుంది.
ఇది టూ-ఇన్-వన్ స్వీపింగ్, మోపింగ్ ఫంక్షన్‌తో వస్తుంది. నావిగేషన్ కోసం ఇందులో లేజర్ డిటెక్ట్ సిస్టమ్ (ఎల్‌డిఎస్) ను అమర్చారు. ఎంఐ రోబోట్ వాక్యూమ్-మోప్ పి 12 హై-ప్రెసిషన్ సెన్సార్లను కలిగి ఉంది. ఎంఐ హోమ్ యాప్ ద్వారా రిమోట్ ఆపరేషన్లకు సపోర్ట్ చేస్తుంది. షియోమి మొదట తన ఎంఐ రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌ను 2016 లో చైనాలో ప్రారంభించింది, అయితే ఈ మధ్యకాలంలో ఈ మోడల్‌కు కొన్ని మార్పులను తీసుకువచ్చింది.
ఎంఐ రోబోట్ వాక్యూమ్-మోప్ పి గత ఏడాది చైనా మార్కెట్లో లాంచ్ అయినప్పటికి ఎంఐ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ మోడల్ ఇండియాకి-స్పెసిఫిక్ వెర్షన్ గా ఉంటుంది. భారతదేశంలో ఎంఐ రోబోట్ వాక్యూమ్-మోప్ పి ధర రూ. 29.999. అయితే, ప్రస్తుతం ఇది రూ. 17,999 ధరకు అందుబాటులోకి వచ్చింది.
కస్టమర్లు నెలకు 2,999 రూపాయలు చెల్లించి నో-కాస్ట్ ఇఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు. అంతేకాకుండా, ఎంఐ రోబోట్ వాక్యూమ్-మోప్ పిని ప్రస్తుతం ఎంఐ క్రౌడ్‌ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు, ఎగుమతులు సెప్టెంబర్ 15 నుండి ప్రారంభమవుతాయి.
షియోమి ఎంఐ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ భారతదేశంలోని ఇతర రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లకు గట్టి పోటీని ఇస్తుంది. ఎంఐ రోబోట్ వాక్యూమ్-మోప్ పిలో 2,100పిఏ శక్తి గల జపనీస్ బ్రష్‌లెస్ మోటారుతో వస్తుంది. వాక్యూమ్ క్లీనర్‌లో ఇంటెలిజెంట్ మ్యాపింగ్, రూట్ ప్లానింగ్ ఫీచర్స్ ఉన్నాయి.
also read ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థపై దాడి... అప్రమత్తమవడంతో తప్పిన ముప్పు...
ఈ వాక్యూమ్ క్లీనర్ ఎనిమిది మీటర్ల స్కానింగ్ రేంజ్ కలిగి ఉందని, సాంప్లింగ్ రేట్ సెకనుకు 2,016 సార్లు ఉంటుందని షియోమి పేర్కొంది. ఇంటిని శుభ్రపరిచే విషయంలో, భారతీయ గృహాలకు అనుకూలంగా స్వీపింగ్ + మోపింగ్ మోడ్ ఇందులో ఉంది.
రిమోట్ కంట్రోల్, రియల్ టైమ్ మ్యాపింగ్, షెడ్యూల్ క్లీనింగ్, స్పాట్ క్లీనింగ్ వంటి ఫీచర్లను వారి స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించి నేరుగా యాక్సెస్ చేయడానికి వినియోగదారులు తమ ఎంఐ రోబోట్ వాక్యూమ్-మోప్ పిని ఎంఐ హోమ్ యాప్ తో కనెక్ట్ చేయవచ్చు.
ఎంఐ రోబోట్ వాక్యూమ్-మోప్ పిలో క్వాడ్-కోర్ కార్టెక్స్-ఎ 7 సిపియు, డ్యూయల్ కోర్ మాలి 400 జిపియు ఉంది. వాక్యూమ్ క్లీనర్ ఎల్‌ఓ ఆటోమేటిక్ రీఛార్జ్, రెస్యూమ్ ఫీచర్ కూడా ఉంది, అంతేకాదు హార్డ్‌వేర్ దాని ఛార్జింగ్ పాయింట్‌కు వెళ్లి స్వయంగా రీఛార్జ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.=
నేటి రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లలో ఇలాంటిదే మీకు లభిస్తుంది కాబట్టి ఈ ఫీచర్ ప్రత్యేకమైనది కాదు. ఎంఐ రోబోట్ వాక్యూమ్-మోప్ పిలో 3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది, ఇది ఒకే ఛార్జీపై 60-130 నిమిషాల పాటు నడుస్తుంది.
ఈ డివైజ్ కనెక్టివిటీలో వై-ఫై 802.11 బి / జి / ఎన్, స్టాండర్డ్ మోడ్‌లో 70 డిబి వరకు సౌండ్ ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, ఎంఐ రోబోట్ వాక్యూమ్-మోప్ పి 350x94.5 ఎంఎం, 3.6 కిలోగ్రాముల బరువు ఉంటుంది.