వన్‌ప్లస్ నుండి కొత్త 5జి స్మార్ట్ ఫోన్స్ లాంచ్...

By Sandra Ashok Kumar  |  First Published Apr 18, 2020, 10:47 AM IST

ఆండ్రాయిడ్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌  ఆధారంగా  వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది.  ఆక్సిజన్ ఓఎస్‌కు సున్నితంగా పనిచేయడానికి 280 కొత్త ఆప్టిమైజేషన్లను జోడించినట్లు కంపెనీ పేర్కొంది.


న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్స్ రంగంలో వన్‌ప్లస్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ ఒక మంచి గుర్తింపు పొందింది. వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్స్ ధరలు కాస్త ఎక్కువ అనిపించిన కానీ దాని ఫీచర్స్ పరంగా చాలా అప్ డేట్ గా, బెస్ట్ స్మార్ట్  ఫోన్స్ గా నిలిచాయి. అయితే ఇప్పుడు వన్‌ప్లస్ బ్రాండ్ రెండు కొత్త  స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది.

ఆండ్రాయిడ్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌  ఆధారంగా  వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది.  ఆక్సిజన్ ఓఎస్‌కు సున్నితంగా పనిచేయడానికి 280 కొత్త ఆప్టిమైజేషన్లను జోడించినట్లు కంపెనీ పేర్కొంది.

Latest Videos

కొత్త ఆక్సిజన్ ఓఎస్ ఫీచర్లు స్మూత్ బాటిల్ 2.0, న్యూ డార్క్ థీమ్, డైనమిక్ వాల్‌ పేపర్స్, లైవ్ క్యాప్షన్, అమెజాన్ అలెక్సా స్మార్ట్ అసిస్టెంట్‌, అలెక్సా హ్యాండ్స్-ఫ్రీ, యాప్ గ్యాలరీ ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి ఫీచర్లను అధునాతనంగా అందించినట్టు కంపెనీ వెల్లడించింది.

5జీ సపోర్ట్ ఫీచర్ అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ను ఆన్ లైన్ ద్వారా విడుదల చేసింది. భారతీయ మార్కెట్ల ధరలపై స్పష్టంగా ప్రస్తావించకపోయినప్పటికీ అందుబాటులో ధరల్లోనే లభ్యమవుతాయని వన్‌ప్లస్ బ్రాండ్ ట్విటర్ ద్వారా ట్వీట్  చేసింది. 

also read  ఈ-కామర్స్ సంస్థలకు గుడ్ న్యూస్...20 నుంచి ఆన్ లైన్ ఆర్డర్లకు గ్రీన్ సిగ్నల్


వన్‌ప్లస్ 8 స్మార్ట్ ఫోన్  ఫీచర్లు
 దీనికి 6.55 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే, 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ ,క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, ఆండాయిడ్ 10  ఓఎస్, 48+2మాక్రో లెన్స్+16 ఎంపీ టెర్టియరీ సెన్సార్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. 

వన్‌ప్లస్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ ఫీచర్లు
దీనికి 6.78 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 10 ఓఎస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 1440x3168 పిక్సెల్స్ రిజల్యూషన్, 8జీబీర్యామ్,128 జీబీ స్టోరేజ్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 48+8+48+5 ఎంపీ క్వాడ్ రియర్ కెమరా, 4510ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఇందులో ఉంది.

భారత మార్కెట్లో వీటి ధరలు 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.53,200, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.60,800 ఉంటుండొచ్చు అని భావిస్తున్నారు. వన్‌ప్లస్ 8 ప్రో  ధర మాత్రం  రూ. 55వేల నుండి ప్రారంభవుతుంది. 

click me!