మేము 'మేక్ ఇన్ ఇండియా'కు కట్టుబడి ఉన్నాం": చైనా కంపెనీ..

By Sandra Ashok Kumar  |  First Published Jul 3, 2020, 2:53 PM IST

వన్‌ప్లస్  కంపెనీ భారతదేశంలో టీవీల తయారీని ప్రారంభించిందని, మేక్‌ ఇన్‌ ఇండియా వ్యూహంలో దీర్ఘకాలిక వృద్ధిని సాధించడానికి కట్టుబడి ఉన్నామని వన్‌ప్లస్ ఎగ్జిక్యూటివ్ శుక్రవారం మాట్లాడుతూ  ప్రకటించారు. 


ఇండియాలో చైనా వ్యతిరేకత పెరిగినప్పటికీ స్మార్ట్ ఫోన్  బ్రాండ్ వన్‌ప్లస్ కీలక విషయాన్ని తెలిప్పింది. వన్‌ప్లస్  కంపెనీ భారతదేశంలో టీవీల తయారీని ప్రారంభించిందని, మేక్‌ ఇన్‌ ఇండియా వ్యూహంలో దీర్ఘకాలిక వృద్ధిని సాధించడానికి కట్టుబడి ఉన్నామని వన్‌ప్లస్ ఎగ్జిక్యూటివ్ శుక్రవారం మాట్లాడుతూ  ప్రకటించారు.

స్మార్ట్ ఫీచర్లతో నిండిన వన్‌ప్లస్ టీవీ యు సిరీస్, వై సిరీస్‌లను కంపెనీ గురువారం విడుదల చేసింది, ఇది వినియోగదారులకు ఒకేసారి ఐదు  డివైజెస్ తో కనెక్ట్ అవడానికి  వీలు కల్పిస్తుంది. ప్రీమియం హ్యాండ్‌సెట్ తయారీదారి వన్‌ప్లస్  ఈ వారంలో తొలి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్‌ను ఇండియా, యూరప్‌ దేశాలలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు.

Latest Videos

undefined

"2014లో ఇండియన్ మార్కెట్ లోకి  ప్రవేశించినప్పటి నుండి భారతదేశం వన్‌ప్లస్‌కు కీలక మార్కెట్‌గా కొనసాగుతోంది. 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు అనుగుణంగా మా ఉత్పాదక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి మేము చాలా కష్టపడ్డాము, "అని వన్‌ప్లస్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ నవ్నిత్ నక్రా ఒక ఇమెయిల్ ఇంటర్వ్యూలో చెప్పారు.

వన్‌ప్లస్ సంస్థ 2018 ఫిబ్రవరి నుండి భారతదేశంలో తన టీవీలను తయారు చేస్తోంది. "మేము భారతదేశంలో వన్‌ప్లస్ టీవీల తయారీని కూడా ప్రారంభించాము. అదనంగా, మేము గత సంవత్సరం ఆర్‌అండ్‌డి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించాము, రాబోయే మూడేళ్లలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడికి కట్టుబడి ఉన్నాము" అని నక్రా చెప్పారు.

also read వాట్సాప్ లో రానున్న 5 కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్లు ఏంటో తెలుసా... ...

"మా ఆర్‌అండ్‌డి కేంద్రంతో, వన్‌ప్లస్ భారతదేశంలో దీర్ఘకాలిక వృద్ధిని సాధించడానికి కట్టుబడి ఉంది. ఆర్‌అండ్‌డి కేంద్రంలో ప్రధానంగా మూడు ల్యాబ్‌లు ఉన్నాయి. కెమెరా ల్యాబ్, కమ్యూనికేషన్స్ అండ్ నెట్‌వర్కింగ్ ల్యాబ్‌లు, ఆటోమేషన్ ల్యాబ్‌లు. "దీనికి అనుగుణంగా, మా బృందం కెమెరా, ఆటోమేషన్, నెట్‌వర్కింగ్, కనెక్టివిటీ, ఫ్యూచర్  టెక్నాలజి డివైజెస్ అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది.

దీనిలో 5జి అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి ఉంటుంది" అని నక్రా చెప్పారు. "భారతదేశం వన్‌ప్లస్‌కు కీలకమైన మార్కెట్, ఈ ప్రాంతంలో మన ఉనికిని బలోపేతం చేయడానికి, అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చగల ఉత్పత్తులను రూపొందించడానికి మేము కృషి చేస్తున్నాము" అని ఆయన చెప్పారు.

భారతదేశంలో తమ వ్యాపారం మంచి వృద్ధిని చూసిందని, ఇప్పుడు భారతదేశంలో 5 వేలకు పైగా ఆఫ్‌లైన్ స్టోర్స్‌ ఉన్నాయి, వీటిని 8000వేలకు పైగా స్టోర్లను పెంచడానికి  ప్రయత్నిస్తున్నాము" అని నక్రా పేర్కొన్నారు.


గత నెలలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ లడఖ్‌లో జరిగిన దాడిలో 20 మంది భారతీయ సైనికులు మరణించిన తరువాత భారతదేశంలో చైనా వ్యతిరేక భావన పెరిగింది. జాతీయ భద్రతా సమస్యలపై టిక్‌టాక్, వీచాట్, యుసి బ్రౌజర్, షియోమి ఎం‌ఐతో సహా 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం ఈ వారం నిషేధించింది.

click me!