20ఎంపీ సెల్ఫీ..: Vivo Y17 బాక్స్‌తో సహా స్పెఫికేషన్స్ లీక్

By rajashekhar garrepally  |  First Published Apr 17, 2019, 4:33 PM IST

వీవో నుంచి వచ్చే వారం విడుదల కావాల్సిన Vivo Y17 స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఫోన్ ఫొటోలు లీకయ్యాయి. రూ. 10,000ల కంటే స్వల్పంగా ఎక్కువ ధరల విభాగంలో ఈ ఫోన్ మన దేశ మార్కెట్లోకి వచ్చే వారం ప్రవేశించనుంది. 


వీవో నుంచి వచ్చే వారం విడుదల కావాల్సిన Vivo Y17 స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఫోన్ ఫొటోలు లీకయ్యాయి. రూ. 10,000ల కంటే స్వల్పంగా ఎక్కువ ధరల విభాగంలో ఈ ఫోన్ మన దేశ మార్కెట్లోకి వచ్చే వారం ప్రవేశించనుంది. అయితే, అంతకుముందే ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక విషయాలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి.

స్లాష్‌లీక్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన ఫొటోలు, స్పెసిఫికేషన్స్ పేర్కొనబడ్డాయి. త్వరలో వచ్చే వీవో స్మార్ట్‌‌ఫోన్ వెల్లడించారు. ఆ తర్వాత గాడ్జెట్‌ఫైట్.ఐడీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫోన్‌కు పూర్తి వివరాలను వెల్లడించింది.

Latest Videos

వీవో వై17(Vivo Y17)

వీవో వై17.. 6.35 ఇంచ్ హెచ్‌డీ+ డిస్‌ప్లే 1544x720 పిక్సెల్స్, వాటర్ డ్రాప్ నాచ్‌తో వస్తోంది. ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 128జీబీ మెమోరీ స్పేస్‌తో వచ్చే వారం ఈ ఫోన్ భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ స్టోరేజీ కూడా విస్తరించే అవకాశం ఉందని మనం అంచనా వేయవచ్చు.

వీవో వీ17 ఫోన్ ట్రిపుల్ కెమెరాల రేర్ కెమెరాలను కలిగివుంది. 13ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ సెకండరీ సెన్సార్, 2ఎంపీ సెన్సార్‌తో ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 20ఎంపీ కలిగివుండటం చెప్పుకోదగ్గ విషయం. జీపీఎస్, బ్లూటూత్, వై-ఫై, ఎఫ్ఎం, BeiDou, యూఎస్బీ టైప్-సీ పోర్ట్. 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం విశేషం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగివుంది. ఆండ్రాయిడ్ 9పై ఫన్ టచ్ ఓఎస్9తో ఈ డివైజ్ వస్తున్నట్లు తెలుస్తోంది.
 

click me!