వివో నుంచి 5జీ ఫోన్ ఎస్6.. ధరెంతంటే? 4 నుంచి విక్రయాలు షురూ

By Arun Kumar P  |  First Published Apr 2, 2020, 11:41 AM IST

 చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం వివో కూడా 5జీ ఫోన్ల కుటుంబంలో కొలువుదీరింది. ఎస్6 పేరిట 5జీ స్మార్ట్ ఫోన్‌ను విపణిలోకి విడుదల చేసింది. 6జీబీ విత్ 128 జీబీ స్టోరేజీ సామర్త్యం గల ఫోన్ రూ.28,678 కాగా,  8 జీబీ ర్యామ్‌ విత్ 256 జీబీ ర్యామ్ స్టోరేజీ సామర్థ్యంగల ఫోన్ ధర రూ.31,860గా కంపెనీ నిర్ణయించింది. 
 


బీజింగ్‌:  చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయరీ సంస్థ  వీవో ఎస్‌6 మోడల్‌లో 5జీ ఫోన్‌ను విపణిలోకి విడుదల చేసింది. అమోలెడ్‌ స్క్రీన్‌, శక్తివంతమైన చిప్‌సెట్‌, అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీ, వెనుక భాగంలో నాలుగు కెమెరాలతో ఈ ఫోన్‌ విపణిలో అడుగు పెట్టింది. డ్యూయల్‌ సిమ్‌తో వచ్చే ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉంది. 

వీవో ఎస్‌6 ఫోన్ 6.44 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతోపాటు 20:9 రిజల్యూషన్‌ నిష్పత్తితో ఎఫ్‌హెచ్‌డీ కలిగి ఉంటుంది. 48 మెగా పిక్సల్‌ కెమెరా ప్లస్ 32 మెగా పిక్సల్‌  సెల్ఫీ కెమెరాతోపాటు 8 మెగాపిక్సల్‌ అల్ట్రావైడ్‌ షూటర్‌, 2 మెగా పిక్సల్‌ మ్యాక్రో స్నాపర్‌ ఉన్నాయి. వివో ఎస్6 ఫోన్‌లోని కెమెరా వ్యవస్థలో 4కే వీడియో షూటింగ్, పొర్ట్రయిట్, పనోరమ, డైనమిక్ ఫోటో, ఏఆర్ క్యూట్, షార్ట్ వీడియో, ప్రొఫెషనల్ మోడల్, స్లో మోషన్‌ ఫీచర్లు జత కలిశాయి. 

Latest Videos

undefined

ఈ ఫోన్‌లో ఫన్ టచ్ ఓఎస్ 10, ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ వ్యవస్థలతోపాటు 2.26 జీహెచ్ జడ్ ఎక్స్యోన్ 98 ఓక్టాకోర్ ప్రాసెసర్  ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్‌ విత్ 256 జీబీ స్టోరేజ్‌ సామర్థ్యంలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నది. 

ఈ ఫోన్ ముందు భాగంలో వాటర్‌ డ్రాప్‌ నాచ్‌, ఫింగర్‌ ప్రింట్ రీడర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. యూఎస్బీ టైప్ -సీ పోర్ట్, బ్లూటూత్ వీ 5.1తోపాటు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఈ ఫోన్‌లో లభిస్తాయి. ఈ ఫోన్ ఫేస్ అన్ లాక్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇంతకుముందు వివో సిరీస్ ఫోన్లతో పోలిస్తే ఎస్6 మోడల్ ఫోన్‌లో వాడిన కూల్ టర్బో టెక్నాలజీ 10 శాతం హీట్ తగ్గిస్తుంది.

4500 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌ 18డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. పొట్రైట్‌ షాట్స్‌ కోసం 2 ఎంపీ డెప్తి సెన్సార్‌ను వినియోగించారు. 6 జీబీ ర్యామ్‌ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.28,678 కాగా,  8 జీబీ ర్యామ్‌ విత్ 256 జీబీ ర్యామ్ స్టోరేజీ సామర్థ్యంగల ఫోన్ ధర రూ.31,860గా కంపెనీ నిర్ణయించింది. 

బ్లాక్‌, తెలుపు, నీలం రంగుల్లో ఈ ఫోన్‌ వినియోగదారులకు లభ్యం కానుంది. ఈ నెల నాలుగో తేదీ నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఈ ఫోన్ సంస్థ వెబ్ సైట్ జేడీ డాట్ కామ్‌తోపాటు ఇతర లీడింగ్ ఆన్ లైన్ రిటైల్ వెబ్ సైట్ల నుంచి కొనుగోలు చేసే వారికి ఆఫర్లు అందిస్తున్నది. 

click me!