నోకియా నుండి వచ్చిన ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ ఫోన్‌ను మీరు గుర్తుండే ఉంటుంది, సంగీతం, ఎఫ్‌ఎం రేడియో ఫీచర్లకు మంచి పేరుగాంచింది.
కొన్ని పాత నోకియా ఫీచర్ ఫోన్‌లను రిస్టోర్ చేసిన తరువాత, ఫిన్నిష్ కంపెనీ ఇప్పుడు లేటెస్ట్ నోకియా 5310 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ ఫోన్ ను ఆవిష్కరించింది. నోకియా నుండి వచ్చిన ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ ఫోన్‌ను మీరు గుర్తుండే ఉంటుంది, సంగీతం, ఎఫ్‌ఎం రేడియో ఫీచర్లకు మంచి పేరుగాంచింది.
అయితే ఇది మళ్ళీ కొత్త లుక్ తో మన ముందుకు వచ్చింది. దీని ధర సుమారు 39 యూరోలు, అంటే దాదాపు రూ .1,150. ఇది వైట్ / రెడ్, బ్లాక్ / రెడ్ నాస్టాల్జిక్ కలర్ కాంబినేషన్‌లో వస్తుంది.
also read బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్...వారికోసం ఫ్రీ డాటా...
ఫోన్లో డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లు, ఎంపి3 ప్లేయర్, ఎఫ్‌ఎం రేడియోతో క్యాండీబార్ డిజైన్‌తో మళ్ళీ మన ముందుకు వస్తుంది. నోకియా 5310 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ (2020) ఫోన్‌లో ప్లేబ్యాక్‌ను కంట్రోల్ కోసం ఫిజికల్ బటాన్స్ ప్లే / పాజ్ బటన్, నెక్స్ట్ ఇంకా బ్యాక్ బటన్లు ఉంటాయి.
ఈ బటన్లు రెడ్ కలర్ లో అందంగా కనిపిస్తాయి. ఈ ఫీచర్ ఫోన్‌లో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది. నోకియా 5310 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ 2.4-అంగుళాల క్యూవిజిఎ డిస్‌ప్లే, టి 9 కీబోర్డ్ మధ్యలో నావిగేషన్ బటన్‌ను ఉంటుంది.
ఈ ఫోన్ నోకియా సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. నోకియా 5310 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ యూట్యూబ్, జిమెయిల్, గూగుల్, వాట్సాప్ వంటి యాప్‌లను రన్ చేయలేదు. కానీ మీరు బ్రౌజర్‌ను ఉపయోగించి ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయవచ్చు.
also read ఒప్పో కొత్త వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్...
నోకియా 5310 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ మీడియాటెక్ MT6260A చిప్‌సెట్, 8MB ర్యామ్, 16MB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇది మ్యూజిక్-సెంట్రిక్ ఫోన్ కాబట్టి, మీరు సాంగ్స్ స్టోర్ చేయడానికి 32GB వరకు మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. దాదాపు 8,000 మ్యూజిక్ ట్రాక్‌లు స్టోర్ చేసుకోవచ్చు.
నోకియా 5310 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ 1200 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది 30 రోజుల స్టాండ్‌బై ఇస్తుందని నోకియా పేర్కొంది. ఇది మార్చిలోనే లభిస్తుంది కాని ఇండియాలో అందుబాటులోకి వస్తుందా లేదా అనేది ఇంకా నిర్ధారించలేదు.