Vivo S1 Pro విడుదల: పాప్-అప్, ట్రిపుల్ కెమెరా హైలట్, ఫీచర్లివే..

By rajashekhar garrepally  |  First Published May 7, 2019, 12:17 PM IST

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వీవో తన కొత్త స్మార్ట్ ఫోన్ వీవో ఎస్1 ప్రోను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన వీవో వీ15 ప్రోను ఈ ఫోన్ పోలి ఉంటుంది.


ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వీవో తన కొత్త స్మార్ట్ ఫోన్ వీవో ఎస్1 ప్రోను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన వీవో వీ15 ప్రోను ఈ ఫోన్ పోలి ఉంటుంది. అయితే, 
 పాప్-అప్ సెల్ఫీ కెమెరా ఫీచర్‌ను ఈ కొత్త ఫోన్‌లో ఆకట్టుకునే విషయం. 

వీవో ఎస్1 ప్రోను రెండు వేరియెంట్లలో విడుదల చేసింది. 6/8జీబీ ర్యామ్, 256/128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ. ఇక కెమెరా విషయానికొస్తే.. 48ఎంపీ, 8ఎంపీ, 5ఎంపీ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32ఎంపీ పాప్-అప్ సెల్ఫీ కెమెరా ఉంది.

Latest Videos

ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్ లో మరో ప్రత్యేకత. చైనాలో ఈ ఫోన్ ప్రారంభ ధరను 2,698 సీఎన్‌వై(రూ. 27,700)గా నిర్ణయించారు. బ్లూ, రెడ్ కలర్ వచ్చింది. మే 9 నుంచి వినియోగదారులకు ఈ కొత్త ఫోన్ అందుబాటులో ఉండనుంది. 

వీవో ఎస్1 స్పెసిఫికేషన్స్:

6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే 
2340 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌ 
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌ 
ఆండ్రాయిడ్ 9.0 పై 
6/8 జీబీ ర్యామ్‌
 256/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌ 
48+8+5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 
ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ 
డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై 
బ్లూటూత్ 5.0 
యూఎస్‌బీ టైప్ సి 
డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ 
డ్యుయ‌ల్ సిమ్‌ 
3700 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

click me!