ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో నోకియా 9 ప్యూర్ వ్యూను త్వరలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది ఫిన్నిష్ బ్రాండ్ హెచ్ఎండీ గ్లోబల్.

వెనుకవైపు ఐదు కెమెరాలతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానున్నట్లు గతంలోనే వెల్లడించింది. 12 ఎంపీ సామర్థ్యమున్న 5 ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ కెమెరాలతో నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది. దీనికి సంబంధించి బ్యూరో ఆఫ్ బిజినెస్ స్టాండర్డ్(బీఐఎస్) సర్టిఫికేట్ పొందినట్లు సమాచారం.
ఈ మొబైల్ త్వరలోనే భారత మార్కెట్లోకి వస్తుందని హెచ్ఎండీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్, ఇండియా హెడ్ అజయ్ మెహతా తెలిపారు. కాగా, నోకియా 9 ప్యూర్ వ్యూ మొబైల్ ఫీచర్ల ఆకట్టుకునేలా ఉండనున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి.
నోకియా 9ఫ్యూర్ వ్యూ ఫీచర్లు
5.99/6 అంగుళాల క్యూహెచ్‌డీ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్
6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
12 ఎంపీ పెంటా రియర్ కెమెరా(హైలైట్ ఫీచర్)
20 ఎంపీ సెల్ఫీ కెమెరా
3డీ టీఓఎఫ్ సెన్సార్
3,320/4150 ఎంఏహెచ్ బ్యాటరీ
కాగా, నోకియా 9 ప్యూర్ వ్యూ ధర దాదాపు రూ.50 వేలుగా ఉండవచ్చని అంచనా.