వాట్సప్‌లో AI విప్లవం! మీరు అనుకున్నది మార్చే ఫీచర్, మెటా AIతో డైరెక్ట్ వాయిస్ చాట్. వాట్సాప్ సీక్రెట్స్ తెలుసుకోండి!
మీరు టైప్ చేసే పదాల్ని, మీకు నచ్చిన స్టైల్లో మార్చే సౌలభ్యం ఉంటే ఎలా ఉంటది? అదిరిపోతుంది కదూ.. వాట్సాప్ తో అదే జరగబోతోంది! అంతేకాదు, ఈ ఫీచర్ ద్వారా మనం మెటా AIతో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు! ఇది జస్ట్ అప్‌డేట్ కాదు, ఒక విప్లవం! ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్, రెండు కొత్త AI ఫీచర్లపై పనిచేస్తోంది. ఇది మన వాట్సాప్ ఎక్స్‌పీరియన్స్‌నే సమూలంగా మార్చేస్తుంది. నమ్మలేకపోతున్నారా? అయితే ఇది చదివేయండి.
సీక్రెట్ AI రీరైట్ ఫీచర్!
వాట్సాప్ ఒక AI-తో నడిచే రీరైట్ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దీని సాయంతో మీరు రాసిన మామూలు వాక్యం మీరు అనుకున్నట్టుగా "ఫన్నీ", "సార్కాస్టిక్", "స్పూకీ", "సపోర్టివ్", ‘‘స్ఫూర్తిదాయకం’’.. ఇలా ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఇది జస్ట్ ఎడిట్ ఆప్షన్ మాత్రమే కాదు, మీ మనసులో ఏముందో, దాన్ని చెప్పే మ్యాజిక్! దీంతో స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామర్ మిస్టేక్స్ అన్నిటినీ సరి చేసే "ప్రూఫ్‌రీడ్" చేసే ఆప్షన్ కూడా ఉంటుంది!
మెటా AIతో డైరెక్ట్ సంభాషణ!
WABetaInfo ఒక పెద్ద విషయం చెప్పింది. మెటా AIతో మీరు డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు! అది కూడా కాల్ మాట్లాడినట్టు! టెక్స్ట్ మెసేజ్ మాత్రమే కాదు, లైవ్‌లో మాట్లాడొచ్చు! మీరు వేరే యాప్ యూజ్ చేస్తున్నా, సంభాషణ కంటిన్యూ అవుతుంది! ఇది జెమిని లైవ్ లా ఉంటుందని అంటున్నారు. నమ్మలేకపోతున్నారు కదా?
ఏమేం రాబోతున్నాయి?
మీరు టైప్ చేసే మెసేజ్‌ని, మీకు నచ్చిన స్టైల్లో మార్చేదే AI రీరైట్ ఫీచర్. స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామర్ మిస్టేక్స్ అన్నిటినీ సరి చేసే "ప్రూఫ్‌రీడ్" ఆప్షన్ కూడా ఉంది. మెటా AIతో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు, కాల్ మాట్లాడినట్టు! వేరే యాప్ యూజ్ చేస్తున్నా, సంభాషణ కంటిన్యూ అయ్యే ఫెసిలిటీ. సైలెంట్‌గా ఉన్న ప్లేస్‌లో మ్యూట్ చేసుకోవచ్చు, కాల్ కట్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంది. ఇది కేవలం ప్రారంభమే.. ఏఐ ని ఉపయోగించి వాట్సాప్‌లో ఇంకా చాలా అప్‌డేట్స్ తీసుకొస్తామంటోంది మెటా.