టోరెటో బాష్, నెక్స్ట్ జనరేషన్ వైర్‌లెస్ స్పీకర్ తయారు చేసింది. స్పీకర్ తక్కువ బరువుతో మీ జేబులో సులభంగా సరిపోతుంది.టోరెటో బాష్ 1200 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 6 గంటల పాటు నిరంతరాయంగా క్రిస్టల్ క్లియర్ మ్యూజిక్ ప్లే చేస్తుంది.
భారతదేశంలో పాపులర్ ఆడియో డివైజ్, మొబైల్ ఆక్సెసరీస్ తయారీదారి టోరెటో ఒక సరికొత్త పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ టోరెటో బాష్ సౌండ్ సిస్టమ్ విడుదల చేసింది.టోరెటో బాష్, నెక్స్ట్ జనరేషన్ వైర్‌లెస్ స్పీకర్ తయారు చేసింది. స్పీకర్ తక్కువ బరువుతో మీ జేబులో సులభంగా సరిపోతుంది.
టోరెటో బాష్ 1200 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 6 గంటల పాటు నిరంతరాయంగా క్రిస్టల్ క్లియర్ మ్యూజిక్ ప్లే చేస్తుంది. బ్లూటూత్ కాకుండా, యుఎస్బి కేబుల్, టిఎఫ్ కార్డ్, ఎఫ్ఎమ్ ఇంకా ఆక్స్ కేబుల్ ఉపయోగించి బాష్ స్పీకర్లో మీ అభిమాన ట్రాక్‌లను కూడా ప్లే చేయవచ్చు.
undefined
also read samsung CES 2020: శామ్‌సంగ్ నుండి కొత్త గెలాక్సీ క్రోమ్‌బుక్ విడుదల
దీని పోర్టబిలిటీ ఇంకా 5 వాట్స్ అవుట్‌పుట్‌తో మీకు కావలసిన మ్యూజిక్ ఫన్ ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇందులో పవర్ ఫుల్ స్పీకర్ ట్రూ వైర్‌లెస్ కనెక్షన్ (టిడబ్ల్యుఎస్) వంటి ప్రత్యేక ఫీచర్ లను కలిగి ఉంది. ఇది బ్లూటూత్ వి 5.0 ద్వారా ఒకేసారి రెండు స్పీకర్లను కనెక్ట్ చేయడానికి మీకు సహకరిస్తుంది. బాష్‌లో హ్యాండ్స్-ఫ్రీ కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. ఇది మీ కాల్‌లను తీసుకోవడానికి ఇంకా మాట్లాడడానికి మీకు సహాయపడుతుంది.
టోరెటో బాష్ ఫీచర్స్:
ట్రూ వైర్‌లెస్ కనెక్షన్ (టిడబ్ల్యుఎస్) తో బ్లూటూత్ వి 5.0
ఆక్స్, టిఎఫ్ కార్డ్, ఎఫ్‌ఎం ఇంకా యుఎస్‌బి సపోర్ట్
also read ఫేస్ బుక్, ట్విట్టర్ లాగే త్వరలో వాట్సాప్‌లోకి మరో కొత్త ఫీచర్...
1200 mAh బ్యాటరీ
6 గంటల ప్లేటైమ్
5 వాట్స్ అవుట్పుట్
ఇంటర్నల్ మైక్
హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్
ఛార్జ్ సమయం: 1.5 గంటలు
టోరెటో బాష్ అన్ని రిటైల్ షాపులలో అలాగే భారతదేశంలోని అన్ని ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో 1,799 / - రూపాయల ధరకే బ్లాక్, గ్రే & రెడ్ కలర్‌లలో లభిస్తుంది. ఈ పోర్టబుల్ స్పీకర్ ఒక సంవత్సరం వారంటీ కూడా ఇస్తుంది.