samsung CES 2020: శామ్‌సంగ్ నుండి కొత్త గెలాక్సీ క్రోమ్‌బుక్‌ విడుదల

By Sandra Ashok Kumar  |  First Published Jan 7, 2020, 4:06 PM IST

శామ్‌సంగ్ గెలాక్సీ క్రోమ్‌బుక్ క్యూ 1 2020 లో  అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 2-ఇన్ -1 కన్వర్టిబుల్ ఫియస్టా రెడ్, మెర్క్యురీ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. టెంట్, ఫ్లాట్, ల్యాప్‌టాప్ ఇంకా టాబ్లెట్ అనే నాలుగు రీతుల్లో కన్వర్టిబుల్‌కు 360-డిగ్రీలు ఉపయోగించుకోవచ్చు.
 


ఎలట్రానిక్ దిగ్గజ కంపెనీ శామ్సంగ్ ఒక కొత్త  గెలాక్సీ క్రోమ్‌బుక్ CES 2020లో ప్రవేశ పెట్టింది. ఇది చాలా స్లిమ్ గా, తేలికగా ఉంటుంది. ఇది క్రోమ్  ఓ‌ఎస్ తో నడుస్తుంది. ఇన్ బిల్ట్ -స్టైలస్‌, గూగుల్ అసిస్టెంట్‌కు సపోర్ట్ చేస్తుంది. టెంట్, ఫ్లాట్, ల్యాప్‌టాప్ ఇంకా టాబ్లెట్ అనే నాలుగు రీతుల్లో కన్వర్టిబుల్‌కు 360-డిగ్రీలు ఉపయోగించుకోవచ్చు.

also read షియోమీ నుండి కొత్త ఎంఐ 10, ఎంఐ 10 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్...?

Latest Videos

ఇది 9.9mm మందంతో శామ్సంగ్ సన్నని క్రోమ్ బుక్ గా ప్రసిద్ది చెందింది. ఇది 4కే ఏ‌ఎం‌ఓ‌ఎల్‌ఈ‌డి డిస్‌ప్లేను కలిగీ ఉంది. దీని బరువు కేవలం 1.04 కిలోలు. గూగుల్ డ్రైవ్ బ్యాకప్ వంటి ఉపయోగకరమైన ఫీచర్స్ దీనికి ఉన్నాయి. కొత్త శామ్‌సంగ్ గెలాక్సీ క్రోమ్‌బుక్ ధర $999.99 (సుమారు రూ. 71,700) 2020 మొదటి త్రైమాసికంలో అందుబాటులోకి వస్తుంది. 2-ఇన్ -1 కన్వర్టిబుల్ ఫియస్టా రెడ్, మెర్క్యురీ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

 గెలాక్సీ క్రోమ్‌బుక్‌లో రెండు కెమెరాలు ఉన్నాయి - డిస్ ప్లే  స్క్రీన్ పైన 1 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకా కీబోర్డ్ డెక్‌లో మరో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.శామ్‌సంగ్ గెలాక్సీ క్రోమ్ బుక్ 13.3-అంగుళాల (3840x2160) 4కే ఆమోలెడ్ టచ్‌స్క్రీన్ డిస్ ప్లే ఉంటుంది. క్రోమ్ బుక్ ఇంటెల్ 10 వ జనరేషన్ కోర్ ప్రాసెసర్ ద్వారా ఇంటెల్ UHD గ్రాఫిక్స్, 16GB వరకు LPDDR3 RAM తో జతచేయబడింది.

also read ఫేస్ బుక్, ట్విట్టర్ లాగే త్వరలో వాట్సాప్‌లోకి మరో కొత్త ఫీచర్...


దీనికి 1TB SSD స్టోరేజ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, బ్యాక్‌లిట్ కీబోర్డ్‌తో వస్తుంది. 2-ఇన్ -1 లో 2W స్టీరియో స్పీకర్లు ఉన్నాయి, 49.2Wh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, 302.6x203.2x9.9mm  సైజుతో  1.04 కిలోల బరువు మాత్రమే ఉంటుంది.  కనెక్టివిటీ ఎంపికలలో వై-ఫై 6 (802.11ax), రెండు యుఎస్‌బి టైప్-సి పోర్ట్‌లు, యుఎఫ్‌ఎస్ / మైక్రో ఎస్‌డి కాంబో, ఇంటర్నల్ డిజిటల్ డ్యూయల్ అర్రే మైక్, మోనో మైక్ ఉన్నాయి.


యాంబియంట్ ఇక్యూ సామర్థ్యాలతో పాటు హై-కాంట్రాస్ట్ గ్రాఫిక్‌లను అందించడానికి శామ్‌సంగ్ గెలాక్సీ క్రోమ్‌బుక్ త్వరలో హెచ్‌డిఆర్ 400 సపోర్ట్ పొందుతుంది. ప్రారంభించిన సమయంలో ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు, కానీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా సంవత్సరం తరువాత 
వస్తుంది.

click me!