షియోమీ ఎంఐ 10, ఎంఐ 10 ప్రో వేరియంట్ ఫొన్ల ఫీచర్లు బయటకు వచ్చాయి. ఇవి 108 ఎంపీ ప్రైమరీ లెన్స్, 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నట్లు తెలుస్తున్నది. ఎంఐ 6,8,9 స్మార్ట్ఫోన్లను భారత్‌కు తీసుకురాని షియోమీ ఇక ముందు ఎంఐ 10 విషయంలో కూడా అదే ఒరవడి కొనసాగించనున్నట్లు సమాచారం.
బీజింగ్: చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు ఎంఐ 10, ఎంఐ 10 ప్రోలను విపణిలోకి తేవడానికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో ఈ ఎంఐ 10 హ్యాండ్‌సెట్‌ను తేనున్నట్లు షియోమీ స్పష్టం చేసింది. అయితే వాటిని ఎప్పుడు ఆవిస్కరిస్తారన్నది వెల్లడించలేదు.
also read ఫేస్ బుక్, ట్విట్టర్ లాగే త్వరలో వాట్సాప్‌లోకి మరో కొత్త ఫీచర్...
undefined
బార్సిలోనాలో జరగనున్న 2020 టెక్ షోలో షియోమీ.. ఎంఐ 10, ఎంఐ 10 ప్రో ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ల ఆవిష్కరించనున్నట్లు మాత్రం వార్తలొస్తున్నాయి.చైనీస్ మైక్రోబ్లాగింగ్ పోర్టల్ వీబోలో... షియోమీ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ల ఫీచర్లు బహిర్గతం అయ్యాయి. వీటి ప్రకారం ఎంఐ 10, ఎంఐ 10 ప్రోల్లో కెమెరా, బ్యాటరీ సామర్థ్యం, అధిక రీఫ్రెష్ రేట్ స్క్రీన్లు లాంటి అంశాలే తప్ప మిగిలిన ఫీచర్లన్నీ ఒకేలా ఉంటాయని తెలుస్తోంది.
ఎంఐ 10 వేరియంట్ ఫోన్లో 6.5 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లే, 90 హెచ్జడ్ రీఫ్రెష్ రేట్ స్క్రీన్‌తోపాటు ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ అమర్చారు. 5జీ సపోర్ట్ గల క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ ఉంటుంది. ఇంకా 12జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతోపాటు 4500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ, దానికి 40 వాట్ వైర్డ్ +30 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్లు ఉంటాయి.
also read హానర్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్...128gb ఇంటర్నల్ స్టోరేజ్ తో...
ఈ ఫోన్లో 64ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్686 సెన్సార్ 20ఎంపీ సెకండరీ సెన్సార్ కెమెరా, 12ఎంపీ థర్డ్ సెన్సార్ + 5ఎంపీ మాక్రో/డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉండవచ్చు.ఇక ఎంఐ 10 ప్రో వేరియంట్ ఫోన్లో 6.5 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లే, 90 హెచ్జడ్ రిఫ్రెస్ రేట్ స్క్రీన్, ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 865 ఎస్ఓసీ ఫీచర్లు జత కలిశారు.
5జీ సపోర్ట్ కలిగి ఉన్న ఈ ఫోన్ 12జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంటుంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. కెమెరాల విషయానికి వస్తే శామ్సంగ్ సెన్సార్ 108 ఎంపీ ప్రైమరీ కెమెరా లెన్స్, 48 ఎంపీ సెకండరీ సెన్సార్, 12 ఎంపీ థర్డ్ సెన్సార్ + 8 ఎంపీ డెప్త్/మాక్రో సెన్సార్ ఉంటాయని భావిస్తున్నారు.
షియోమీ చివరిసారిగా తన ఫ్లాగ్షిప్ ఫోన్ ఎంఐ 5ను భారత్ మార్కెట్లో విడుదల చేసింది. దాని తరువాత వచ్చిన ఎంఐ 6,8,9 స్మార్ట్ఫోన్లను భారత్‌కు తీసుకు రాలేదు. ఎంఐ 10 విషయంలో కూడా అదే ఒరవడి కొనసాగించనున్నట్లు సమాచారం.భారత్ విషయంలో షియోమీ భిన్నమైన వ్యూహాన్ని అమలుచేస్తోంది. రెడ్మీ, పోకో బ్రాండ్లపై మాత్రమే ప్రస్తుతం దృష్టిసారించింది.