మార్కెట్లోకి టూ ఇన్ వన్ కన్వర్టిబుల్ లాప్ టాప్ అందుబాటులోకి వచ్చింది. టెక్లాస్ట్ అనే సంస్థ దీనిని రూపొందించింది. రూ.30 వేల లోపే ఇది లభించనున్నది.
న్యూఢిల్లీ: టూ ఇన్ వన్ అంటే ఒక్కే దాంట్లో రెండు రకాల సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. అంటే ల్యాప్‌టాప్ ఖరీదుకే ల్యాప్‌టాప్-కమ్-ట్యాబ్లెట్ అందుబాటులోకి రానున్నది. అది కేవలం ల్యాప్‌టాప్ కాదు. కన్వర్టిబుల్ అంటారు.
అంటే - ఇందులో కీబోర్డ్ మామూలు ల్యాప్‌టాప్‌ల మాదిరిగా కేవలం కొంతవరకూ కాకుండా - మొత్తం యాంగిల్ వెనక్కి తిరుగుతుంది. అలా కీబోర్డ్‌ని మడతపెట్టి మానిటర్ వెనక్కి పెట్టేయవచ్చు. అప్పుడు అది ఓ టాబ్లెట్ మాదిరిగా మారిపోతుందన్నమాట. దీన్నే ల్యాప్‌టాప్ కన్వర్టిబుల్ అంటారు.
also read బెంగళూరులోని గూగుల్ ఉద్యోగికి కరోనావైరస్ ... ఒకరి మృతి...
దీన్ని 'ల్యాప్‌టాప్-కమ్-ట్యాబ్లెట్' అని చెప్పవచ్చు. ల్యాప్‌టాప్‌గా కూడా మారే వీలుంది కాబట్టి - సాధారణ ల్యాప్‌టాప్ కంటే ఈ రకం కన్వర్టిబుల్ ల్యాప్‌టాప్స్ ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ టెక్లాస్ట్ కంపెనీ ఎఫ్6 ప్లస్ అనే పేరుతో అనే తన కన్వర్టిబుల్ ల్యాప్‌టాప్‌ని మామూలు ల్యాప్ టాప్ ధరకే వినియోగదారులకు అందిస్తోంది.
దీన్ని ట్యాబ్లెట్‌గా మాత్రమే యూజ్ చేసుకోవడం కాదు, ఐపాడ్ ప్రో మాదిరిగా దీనిమీద ప్రత్యేకమైన స్టైలస్‌తో రాసుకోవచ్చు కూడా! బ్యాటరీ లైఫ్ కాస్త యావరేజ్‌గా ఉన్నప్పటికీ - దీని నిర్మాణం చాలా ముచ్చటగొలుపుతుంది.
చౌక ధరలో దొరుకుతూనే టూ-ఇన్-వన్ ల్యాప్‌టాప్ అనిపించుకునే ఎఫ్ 6 ప్లస్ అనే ఈ కన్వర్టిబుల్ డివైజ్‌ని టెక్లాస్ట్ కంపెనీ దాదాపు 360 డాలర్లకి అందిస్తోంది. మన కరెన్సీలో అయితే దీని ఖరీదు రూ. 30 వేల లోపేనన్నమాట.
ఇప్పటి వరకు టాబ్లెట్ కం లాప్ టాప్ తయారు చేయడానికి దశాబ్ద కాలంగా ప్రయోగాలు జరిగాయి. ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థలు లెనోవో, డెల్ ఈ ప్రయోగాల్లో ముందు ఉన్నా.. కానీ ఈనాడు ఈ తరహా ఎఫ్ 6 ప్లస్ కన్వర్టిబుల్ టాబ్లెట్ కం లాప్ టాప్ వాడుకునేందుకు సిద్ధం అవుతున్నాయి.
also read లేటెస్ట్ వెరైటీ ఫీచర్లతో వీయు ప్రీమియం 4కె టీవీలు...
విండోస్ 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఆన్ బోర్డు స్టోరేజీ సామర్థ్యం కలిగి ఉంటుందీ ఎఫ్ 6 ప్లస్ లాప్ టాప్ కం కన్వర్టిబుల్ టాబ్లెట్. అయితే చౌక ధరకే లభిస్తుందని మురిసిపోవద్దు సుమా. వీటిలో నాణ్యమైనవి పొందాలంటే మాత్రం కాస్త ధర పెట్టాల్సిందే మరి.
13.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే కలిగి ఉన్న ఈ కన్వర్టిబుల్ టాబ్లెట్ కం లాప్ టాప్ మైక్రో ఎస్డీ కార్డ్ రీడర్, మైక్రో హెచ్డీఎంఐ పోర్ట్, ప్లస్ ఏ టైప్ సీ కనెక్టర్‌కు మద్దతుగా ఉంటుంది. అత్యవసర సమయాల్లో పరిష్కారంగా ఉంటుందిది. క్వాడ్ కోర్ ఇంటెల్ సెలెరాన్ ఎన్4100, బ్యాటరీ లైప్ మూడు గంటల్లోపే ఉంటుంది.