సోని కొత్త పాకెట్ సైజ్ డిజిటల్ కెమెరా...

By Sandra Ashok Kumar  |  First Published Jul 27, 2020, 11:17 AM IST

సైడ్-ఓపెనింగ్ యాంగిల్ ఎల్‌సిడి స్క్రీన్ కలిగిన మొట్టమొదటి సోనీ కెమెరా ఇది. జెడ్‌వి -1ను కేవలం ఒక చేత్తో హాయిగా ఆపరేట్ చేయవచ్చు, సులభంగా పట్టుకోగలిగి సౌకర్యవంతమైన వీడియో రికార్డింగ్‌ కోసం కెమెరా పైభాగంలో ఉన్న మూవీ రికార్డింగ్  బటన్ దీని ప్రత్యేకత. 


ఎలక్ట్రానిక్స్ కంపెనీ సోనీ శుక్రవారం ఇండియాలో సైడ్ ఓపెనింగ్ ఎల్‌సిడి స్క్రీన్‌తో జెడ్‌వి -1 అనే కొత్త పాకెట్ సైజ్ కాంపాక్ట్ డిజిటల్ కెమెరాను విడుదల చేసింది. దీని ధర ఇండియాలో రూ .77,990కు లభ్యమవుతుంది.

సైడ్-ఓపెనింగ్ యాంగిల్ ఎల్‌సిడి స్క్రీన్ కలిగిన మొట్టమొదటి సోనీ కెమెరా ఇది. జెడ్‌వి -1ను కేవలం ఒక చేత్తో హాయిగా ఆపరేట్ చేయవచ్చు, సులభంగా పట్టుకోగలిగి సౌకర్యవంతమైన వీడియో రికార్డింగ్‌ కోసం కెమెరా పైభాగంలో ఉన్న మూవీ రికార్డింగ్  బటన్ దీని ప్రత్యేకత.

Latest Videos

కెమెరా ముందు భాగంలో రికార్డింగ్ లాంప్‌తో వస్తుంది, ఇది యాక్టివ్ రికార్డింగ్‌ను సూచిస్తుంది. ఈ కెమెరా ఆగస్టు 6 నుండి అమెజాన్‌లో భారతదేశంలో లభిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

also read 

"సెల్ఫీ-ఫ్రెండ్లీ వేరి-యాంగిల్ ఎల్‌సిడి స్క్రీన్, బాడీ గ్రిప్, వివిధ సెట్టింగులు, మోడ్‌లతో రికార్డింగ్ లాంప్ వంటి టెక్నాలజితో  వినూత్నమైన డిజైన్‌ను కలిగి ఉంది. వీడియో రికార్డింగ్  సమయంలో ఇంతకు ముందులేని విధంగా వీడియో రూపొందించడానికి వీలు కల్పిస్తుంది,

"సోనీ ఇండియా డిజిటల్ ఇమేజింగ్ బిజినెస్ హెడ్ ముఖేష్ శ్రీవాస్తవ అన్నారు. హెచ్‌డి మోడ్‌లో రికార్డింగ్ చేసేటప్పుడు, ఆప్టికల్, ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ ద్వారా కెమెరా షేక్ కాకుండా సహాయపడుతుంది. అయితే ఆప్టికల్ స్టెడి షాట్ మోడ్‌ను ఉపయోగించి 4కె వీడియోను షూట్ చేయవచ్చు.

కెమెరా వైర్‌లెస్ రిమోట్ కమాండర్‌తో 'GP-VPT2BT' షూటింగ్ గ్రిప్‌తో వస్తుంది. సోనీ కొత్త డైరెక్షనల్ 3-క్యాప్సూల్ మైక్‌ ఇందులో ఉంది, ఇది ఫార్వర్డ్-డైరెక్షనల్ ఆడియో రికార్డింగ్ కోసం రూపొందించారు.

click me!