ఒప్పో నుండి లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే ?

By Sandra Ashok Kumar  |  First Published Jul 25, 2020, 10:11 PM IST

 ఒప్పో ఏ72 5జి ప్రాసెసర్ పరంగా డివైజెస్ 4G వేరియంట్ కన్న అధిక-తాజా రీఫ్రెష్ రేటుతో విభిన్నంగా ఉంటుంది. కాబట్టి ఒప్పో ఏ72 5జి ఫీచర్లు, ధరలను ఒకసారి చూద్దాం.


కొన్ని నెలల ఊహాగానాలు, లీకేజీల తరువాత చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో ఎట్టకేలకు ఒప్పో ఏ72 5జి స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ చేసింది. అయితే ఇది 90హెచ్‌జెడ్  డిస్ ప్లే తో వస్తుంది. ఒప్పో ఏ72 5జస్మార్ట్‌ఫోన్  ఏప్రిల్‌లో 4జి వేరియంట్‌ను లాంచ్ చేసిన కొన్ని నెలల తర్వాత 5జి అందుబాటులోకి వస్తుంది.

అయినప్పటికీ ఒప్పో ఏ72 5జి ప్రాసెసర్ పరంగా డివైజెస్ 4G వేరియంట్ కన్న అధిక-తాజా రీఫ్రెష్ రేటుతో విభిన్నంగా ఉంటుంది. కాబట్టి ఒప్పో ఏ72 5జి ఫీచర్లు, ధరలను ఒకసారి చూద్దాం.

Latest Videos


ఒప్పో ఏ72 5జి ఫీచర్లు
ఒప్పో ఏ72 5జి లో 6.5-అంగుళాల పూర్తి-హెచ్‌డి ప్లస్,  1,080x2,400 పిక్సెల్స్ రిజల్యూషన్, స్క్రీన్ టు బాడీ రేషియో 90.5 శాతం, ఒప్పో ఏ72 రిఫ్రెష్ రేటు 60హెచ్‌జెడ్ తో వస్తుంది. ఒప్పో ఏ72 5జి మీడియాటెక్ డైమెన్సిటీ 720 ఎస్‌ఓ‌సి తో పనిచేస్తుంది. 8జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్, మరోవైపు ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 తో పనిచేస్తుంది.

4జి‌బి ర్యామ్,  128జి‌బి స్టోరేజ్, 4,040mAh బ్యాటరీ 18 W ఫాస్ట్ ఛార్జింగ్‌, 4జి  వేరియంట్‌లో కొంచెం పెద్ద 5000mAh బ్యాటరీతో వస్తూంది. కనెక్టివిటీలో ఒప్పో ఏ72  5జిలో 5జి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్ వి5.0, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, ఇతర స్టాండర్డ్  కనెక్టివిటీ ఆప్షన్స్  ఉన్నాయి. ఒప్పో  ఏ72  5జి ఆండ్రాయిడ్ 10 కలర్‌ ఓఎస్ 7.2తో పని చేస్తుంది.

also read 

ఒప్పో  ఏ72  5జి కెమెరా
ఆప్టిక్స్ విషయానికొస్తే ఒప్పో  ఏ72  5జి వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌, ఇందులో 16- మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ కెమెరా, సెల్ఫీలు కోసం 16 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కెమెరా కూడా ఉంది. ఒప్పో ఏ72  4జి  వేరియంట్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మోనో సెన్సార్ ఉన్నాయి. ముందు వైపు సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ పంచ్-హోల్ కెమెరా ఉంది.

ఒప్పో ఏ72  5జి  ధర
ఒప్పో ఏ72  5జి సింగిల్ 8జి‌బి + 128జి‌బి వేరియంట్ ధర చైనాలో సి‌ఎన్‌వై 1,899 (సుమారు రూ. 20,200) విడుదల ధరతో చేసింది.  నియాన్, ఆక్సిజన్ వైలెట్, సింపుల్ బ్లాక్ సహా మూడు వేర్వేరు కలర్ ఆప్షన్స్ లో  విడుదల చేసింది. గ్లోబల్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ గురించి ఒప్పో ఇంకా ఎలాంటి సమాచారం అధికారికంగా  వెల్లడించలేదు.

click me!