బడ్జెట్‌ ధరకే రియల్‌మి 6జి‌బి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్..

By Sandra Ashok Kumar  |  First Published Jul 25, 2020, 11:18 AM IST

ఇందులో 4జి‌బి ర్యామ్ + 64జి‌బి స్టోరేజ్ ధర రూ .12,999, 6జి‌బి ర్యామ్ + 64జి‌బి స్టోరేజ్  ధర రూ.14,999తో  వస్తుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌ మీ ఆన్‌లైన్ పోర్టల్‌ ద్వారా అందుబాటులో ఉంది. జూలై 31 నుండి ఆఫ్‌లైన్ స్టోర్లను లభ్యమవుతుంది. ఫోన్ లూనార్ వైట్, ఎక్లిప్స్ బ్లాక్ కలర్ లో లభిస్తుంది.
 


చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌ మీ శుక్రవారం ఇండియాలో రియల్‌ మీ 6ఐ  లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హెలియో జి90టి సిస్టమ్-ఆన్-చిప్, 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ఫుల్‌హెచ్‌డి ప్లస్ స్క్రీన్, 30w ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, క్వాడ్ రియర్ కెమెరాలు, స్ప్లాష్ రెసిస్టెంట్ డిజైన్ ఉన్నాయి.

ఇందులో 4జి‌బి ర్యామ్ + 64జి‌బి స్టోరేజ్ ధర రూ .12,999, 6జి‌బి ర్యామ్ + 64జి‌బి స్టోరేజ్  ధర రూ.14,999తో  వస్తుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌ మీ ఆన్‌లైన్ పోర్టల్‌ ద్వారా అందుబాటులో ఉంది. జూలై 31 నుండి ఆఫ్‌లైన్ స్టోర్లను లభ్యమవుతుంది. ఫోన్ లూనార్ వైట్, ఎక్లిప్స్ బ్లాక్ కలర్ లో లభిస్తుంది.

Latest Videos

also read 

రియల్ మీ 6ఐ ఫీచర్స్
రియల్‌ మీ 6ఐ 6.5-అంగుళాల ఫుల్‌హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్ స్క్రీన్‌, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 120 హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంది. రియల్ మీ సంస్థ ప్రకారం ఈ ఫోన్ మీడియాటెక్ గేమింగ్-సెంట్రిక్ హెలియో జి90టితో పనిచేస్తుంది,

ఇందులో  6జి‌బి  ర్యామ్, 64జి‌బి  ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఫోన్‌లో మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్ ఆప్షన్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత రియల్ మీ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో ఫోన్ వస్తుంది. ఇందులో 4300 mAh బ్యాటరీని 30W డార్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో సపోర్ట్ అందిస్తుంది. అయితే, ఫోన్ 20W ఇన్-బాక్స్ వైర్డ్ ఛార్జర్‌తో వస్తుంది.

ఫోన్ వెనుక భాగంలో నాలుగు కెమెరాలు ఉన్నాయి, ఇందులో ఎఫ్ / 1.8 ఎపర్చరుతో  48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్/2.3 ఎపర్చరుతో  8 ఎంపి అల్ట్రా-వైడ్ సెన్సార్, 119-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూ, 2 ఎంపి మోనోక్రోమ్ పోర్ట్రెయిట్ సెన్సార్, 2 ఎంపి సెన్సార్. ముందు వైపు, ఫోన్ లో ఎఫ్ / 2.0 ఎపర్చరుతో  16 ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
 

click me!