ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ దిగ్గజం సోనీ తాజాగా ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్ 9500జీ సిరీస్‌లో 75 అంగుళాల స్క్రీన్‌తో తీసుకొచ్చింది. 4కే ఆల్ట్రా హెచ్‌డీ ఎల్ఈడీ టీవీనీ ‘కేడీ 75 ఎక్స్ 9500జీ’ పేరుతో భారత మార్కెట్లోకి తెచ్చింది.

ఈ ఆండ్రాయిడ్ టీవీ ధర రూ. 4,49,990గా నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా ఉన్న సోనీ సెంటర్, ఇతర ఎలక్ట్రానిక్స్ స్టోర్ల ద్వారా ఈ టీవీలు అందుబాటులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. సాధారణ ఎల్ఈడీ టీవీల కంటే ఆరు రేట్లు ఎక్కువ క్వాలిటీ పిక్చర్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.
undefined
ఆండ్రాయిడ్ 8.0 సపోర్టుతో లభిస్తున్న 75 అంగుళాల స్క్రీన్, ఆకట్టుకునే బెజెల్‌లెస్ డిస్‌ప్లే. అంతేగాక, 3840x2160 పిక్సెల్స్ రిజల్యూషన్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, ఎక్స్1 అల్టిమేట్ పిక్చర్ ప్రాసెసర్, ఫుల్ అర్రే లోకల్ డిమ్మింగ్ బ్యాక్ లైట్, ఆల్ట్రా వైడ్ వ్యూయింగ్ యాంగిల్, నెట్‌ఫ్లిక్స్ కాలిబ్రేటెడ్ మోడ్, 16 జీబీ స్టోరేజీ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.
సోనీ ఆండ్రాయిడ్ టీవీ నెట్‌ఫ్లిక్స్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. ఇంకా అకాస్టిక్ మల్టీ ఆడియో, డోల్బీ ఆట్మస్ బిల్టిన్, డిస్‌ప్లే డ్యూయల్ 10డబ్ల్యూ స్పీకర్స్. వెనుకవైపు రెండు సౌండ్ పొజిషనింగ్ ట్వీటర్స్ కూడా ఉన్నాయి.
కాలిబ్రేటెడ్ మోడ్, 16 జీబీ స్టోరేజ్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.